Modi-Putin: ఒకే కారులో మోడీ–పుతిన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రయాణం

Modi-Putin: ఒకే కారులో మోడీ–పుతిన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రయాణం
x

Modi-Putin: ఒకే కారులో మోడీ–పుతిన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రయాణం

Highlights

చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో (SCO) సమావేశం హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ప్రధాని మోడీ–పుతిన్ కలయికే ఈ మీటింగ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో (SCO) సమావేశం హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ప్రధాని మోడీ–పుతిన్ కలయికే ఈ మీటింగ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సమావేశం ప్రారంభానికి ముందు మోడీ–పుతిన్ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అనంతరం గ్రూప్ ఫొటో సెషన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా కాసేపు చర్చించారు. ఈ సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ పక్కనే ఉన్నా, మోడీ అతన్ని పట్టించుకోకపోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక సమావేశం ముగిసిన తర్వాత మోడీ–పుతిన్ ఒకే కారులో ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్నందుకు అమెరికా ఇప్పటికే తీవ్రంగా స్పందిస్తున్న తరుణంలో, మోడీ–పుతిన్ కలిసి ప్రయాణించడం అంతర్జాతీయ స్థాయిలో మరింత చర్చనీయాంశమైంది.

ఇటీవల పుతిన్–ట్రంప్ అలాస్కాలో భేటీ అయ్యారు. దానిపై మోడీ–పుతిన్ ఇప్పటికే ఫోన్‌లో చర్చించుకున్నారు. ఇప్పుడు ముఖాముఖిగా కలుసుకుని ఉక్రెయిన్–రష్యా సంక్షోభంపై, దానిని పరిష్కరించేందుకు భారత్–చైనా చేసిన ప్రయత్నాలపై చర్చించారు. ఆసియా దేశాల కృషిని పుతిన్ ప్రశంసించారు.

రెండు రోజుల పాటు జరిగిన ఈ ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో 20కి పైగా దేశాధినేతలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రతా సమస్యలు, ఆర్థిక సహకారం, గ్లోబల్ సౌత్ దేశాల స్వరాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories