సునీతా విలియమ్స్ రికార్డ్: స్పేస్ వాక్ అంటే ఏంటి? ఎలా చేస్తారు?

సునీతా విలియమ్స్  రికార్డ్: స్పేస్ వాక్ అంటే ఏంటి? ఎలా చేస్తారు?
x
Highlights

Sunita Williams: సునీతా విలియమ్స్ స్పేస్ వాక్ సమయంలో సెల్పీ తీసుకున్నారు. తన సహచర వ్యోమగామి విల్ బుచ్ మోర్ తో కలిసి ఆమె తీసుకున్న సెల్ఫీని అల్టిమేట్ సెల్ఫీ అంటూ నాసా ప్రకటించింది.

Sunita Williams: సునీతా విలియమ్స్ స్పేస్ వాక్ సమయంలో సెల్పీ తీసుకున్నారు. తన సహచర వ్యోమగామి విల్ బుచ్ మోర్ తో కలిసి ఆమె తీసుకున్న సెల్ఫీని అల్టిమేట్ సెల్ఫీ అంటూ నాసా ప్రకటించింది.

సునీతా విలియమ్స్ సెల్ఫీ ఎలా తీసుకున్నారు?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ ఉన్నారు. 2025 జనవరి 30న పసిఫిక్ మహాసముద్రం నుంచి 423 కి.మీ. ఎత్తులో ఆమె స్పేస్ వాక్ చేశారు. అంతరిక్ష కేంద్రంలో మరమ్మత్తుల కోసం బుచ్ విల్ మోర్ తో కలిసి ఆమె స్పేస్ వాక్ కు వచ్చారు.ఈ సమయంలో తీసుకున్న సెల్ఫీని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలో విలియమ్స్ స్పేస్ సూట్ భాగాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పరిసరాలు ఇందులో కన్పించాయి. తన రెండు చేతులతో సునీతా విలియమ్స్ కెమెరాను చూపించారు.

అంతరిక్షంలో ఆమె ధరించే స్పేస్ సూట్ హెల్మెట్ కూడా ఇందులో చూడవచ్చు. 9వ స్పేస్ వాక్ సందర్భంగా సునీతా విలియమ్స్ విల్ మోర్ అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చి పనిచేయని, పాత హర్డ్ వేర్ ను తొలగించారు. ఇందు కోసం వారిద్దరూ అంతరిక్షంలో 5 గంటల 26 నిమిషాలు అంతరిక్షం బయటే ఉన్నారు.

డెస్టిన లాబోరేటరీ, క్వెస్ట్ ఎయిర్ లాక్ వెంట్స్ వంటి ప్రదేశాల నుంచి తెచ్చిన పదార్ధాల నమూనాలు కూడా తమ వెంట తెచ్చుకున్నారు.ఈ నమూనాలను విశ్లేషించడం ద్వారా అంతరిక్షంలో సూక్ష్మజీవులు ఎలా బయటకు వస్తాయి. ఎంత కఠినమైన పరిస్థితులను తట్టుకుంటాయి. అవి ఎంత దూరం ప్రయాణిస్తాయో తెలుసుకోవచ్చు.

సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డ్

సునీతా విలియమ్స్ స్పేస్ వాక్ లో రికార్డు సృష్టించారు. ఆమె 62 గంటల 6 నిమిషాలు స్పేస్ లో నడిచారు. అత్యధిక టైమ్ స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా సునీతా విలియమ్స్ రికార్డు సృష్టించారు. గతంలో నాసాకు చెందిన మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ పేరిట ఉన్న 60 గంటల 21 నిమిషాల స్పేస్ వాక్ రికార్డును ఆమె బద్దలు కొట్టారు.సునీత విలియమ్స్ కు ఇది 9వ స్పేస్ వాక్. ఆమెతో పాటు ఉన్న విల్ మోర్ కు ఇది ఐదోది.

స్పేస్ వాక్ ఎలా చేస్తారు?

అంతరిక్షంలోని వాహనాన్ని వ్యోమగామి దిగితే దాన్ని స్పేస్ వాక్ అంటారు.వ్యోమగాములు అంతరిక్షంలో నడిచేటప్పుడు తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి స్పేస్‌సూట్‌లను ధరిస్తారు. స్పేస్‌సూట్‌ల లోపల, వ్యోమగాములు పీల్చుకోవడానికి అవసరమైన ఆక్సిజన్‌ ఉంటుంది. తాగడానికి అవసరమైన నీరు కూడా ఉంటుంది.అంతరిక్షంలో నడవడానికి చాలా గంటల ముందు తమ స్పేస్‌సూట్‌లను ధరిస్తారు. ఈ సూట్‌లు ఆక్సిజన్‌తో నిండి ఉంటాయి.

వ్యోమగాములు తమ దుస్తులలో ఒకసారి కొన్ని గంటల పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీల్చుకుంటారు. ఆక్సిజన్‌ను మాత్రమే పీల్చడం వల్ల వ్యోమగామి శరీరంలోని మొత్తం నైట్రోజన్ తొలగిపోతుంది. వారు నైట్రోజన్‌ను వదిలించుకోకపోతే అంతరిక్షంలో నడిచినప్పుడు వారి శరీరంలో గ్యాస్ బుడగలు రావచ్చు. ఈ గ్యాస్ బుడగలు వ్యోమగాములకు భుజాలు, మోచేతులు, మణికట్టు మోకాళ్లలో నొప్పిని కలిగిస్తాయి.

అంతరిక్షనౌక నుంచి ఎయిర్‌లాక్ అనే ప్రత్యేక తలుపు ద్వారా వ్యోమగాములు బయటకు వస్తారు. ఎయిర్‌లాక్‌కు రెండు తలుపులు ఉంటాయి. వ్యోమగాములు అంతరిక్ష నౌక లోపల ఉన్నప్పుడు గాలి లోపలికి రాకుండా ఈ తలుపులు అడ్డుపడతాయి. వ్యోమగాములు అంతరిక్ష నడకకు వెళ్లినప్పుడు మొదటి తలుపు గుండా వెళ్లి దానిని వెనుక గట్టిగా లాక్ చేస్తారు. అప్పుడు వారు అంతరిక్ష నౌక నుండి గాలి బయటకు రాకుండా రెండవ తలుపును తెరవగలరు. అంతరిక్ష నడక తర్వాత వ్యోమగాములు ఎయిర్‌లాక్ ద్వారా తిరిగి లోపలికి వెళతారు.

స్పేస్ వాక్ టైంలో జాగ్రత్తలు

స్పేస్ వాక్ చేసే టైంలో వ్యోమగాములు జాగ్రత్తలు తీసుకుంటారు. ISS వెలుపల అడుగు పెట్టే ముందు ప్రాక్టీస్ చేస్తారు. పని చేస్తున్నప్పుడు ISSకి అందుబాటులో ఉండటానికి వారు అనేక పద్ధతులను పాటిస్తారు.

సేఫ్టీ టెథర్‌లు - వ్యోమగాములు ISSకి బలమైన కేబుల్‌లను ఏర్పాటు చేసుకుంటారు. వీటిని సేఫ్టీ టెథర్ లు అంటారు. అదే విధంగా రాక్ క్లైంబర్‌ తాడుతో తమను తాము సురక్షితంగా ఉంచుకుంటారు. ఇది దూరంగా వెళ్లకుండా నిరోధిస్తుంది. హ్యాండ్‌రెయిల్స్ , ఫుట్ రెస్ట్రెయింట్స్ కూడా అంతరిక్షం వెలుపలి భాగంలో ఉపయోగిస్తారు. సురక్షితమైన జెట్‌ప్యాక్ అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగామి అన్‌టెథర్‌గా మారినప్పుడు జెట్ తో నడిచే బ్యాక్ ప్యాక్ ను ధరిస్తారు. ఇది వారి కదలికలను నియంత్రిస్తోంది. అంతేకాదు అంతరిక్ష కేంద్రానికి తిరిగి వచ్చేలా వీలు కల్పిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories