Israel Iran Conflict: ఇరాన్ పై యుద్ధానికి అమెరికాను తెలివిగా లాగిన ఇజ్రాయేల్ ప్రధాని నెతాన్యుహు..ఎందుకంటే..

Israel Iran Conflict: ఇరాన్ తో యుద్ధానికి ఇజ్రాయేల్ అధ్యక్షుడు నెతాన్యుహు అమెరికాను ఎలా లాక్కొచ్చారు?
x

Israel Iran Conflict

Highlights

Israel Iran Conflict: ఇరాన్ పై యుద్ధానికి ఇజ్రాయేల్ ప్రధాని నెతాన్యుహు అమెరికాను తెలివిగా లాక్కొచ్చారు. అది ఎలా అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు

Israel Iran Conflict: ఒక యుద్ధం జరిగితే దాని వెనుక కారణాలు చాలా ఉంటాయి. రెండు దేశాల మధ్య జరిగే ఘర్షణ ఎక్కడో అక్కడ కనీసం ఆగే అవకాశం ఉంటుంది. అదే ఘర్షణలోకి మూడో పక్షం ప్రవేశిస్తే? అది ఆగడానికి అవకాశాలు తగ్గిపోతాయి. ఇదిగో ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయేల్ వివాదం ముదిరి ఘర్షణగా మారి యుద్ధంగా పరిణమించడానికి అమెరికా ప్రవేశం ప్రధాన కారణంగా మారింది. అసలు ఇరాన్ కి, ఇజ్రాయేల్ కి మధ్య ఉన్న గొడవల్లో అమెరికా ఎందుకు తలదూర్చుతుంది? కేవలం ప్రపంచానికి పెద్దన్నను నేనే అని చెప్పడానికేనా? గతంలో ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పుకునేవారమేమో కానీ, ప్రస్తుతం మాత్రం అది కాదు అనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలోకి ఇజ్రాయేల్ ప్రధాని నేతాన్యుహు తెలివిగా అమెరికాను లాక్కొచ్చాడు. అమెరికా తప్పించుకోవడానికి వీలు లేకుండా పగడ్బందీగా పధకరచన చేసి ప్రపంచం మీద మరో పెద్ద యుద్ధాన్ని రుద్దాడు. అదెలా అనేది తెల్సుకోవాలంటే గతంలో ఏమి జరిగిందో చూడాలి..

Israel Iran Conflict: ఇరాన్ తో ఇజ్రాయేల్ శత్రుత్వం ఏమిటి అనేది పక్కన పెడితే, ఇజ్రాయేల్ మాత్రం ఇరాన్ లోని ఖమేనీ పాలన అంతం చేయాలని కంకణం కట్టుకుంది. అందుకోసం.. ఇజ్రాయేల్ ప్రధాని నేతాన్యుహు దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఇరాన్ అణ్వాయుధాలు సిద్ధం చేస్తోంది అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ పాయింట్ తోనే ఇరాన్ పైకి అమెరికాను ఎగదోయగలిగారు. సౌదీ అరేబియా, ఖతార్ వంటి ముస్లిం దేశాలు ఇరాన్ కు మద్దతు ఇవ్వకుండా ఆపగలిగారు. పైకి అంతా అణ్వాయుధాలను ఇరాన్ సమకూర్చుకోవడం అనే అంశంగా కనిపిస్తున్నప్పటికీ, ఇరాన్ పై యుద్ధానికి ఇతర కారణాలు కూడా అనేకం ఉన్నాయి. నిజానికి ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంపై అమెరికా చేసిన పరిశోధనలో ఎటువంటి ప్రమాదకర పరిస్థితి కనిపించలేదని అనేక రిపోర్టులు చెబుతున్నాయి.

Israel Iran Conflict: అయితే, అదే సాకుతో ఇజ్రాయేల్ పదే పదే అమెరికాను ఎగదోసింది. ఈ రెండు తేదీలలో ఏమి జరిగిందో తెలిస్తే కొంతవరకూ ఇది అర్ధం అవుతుంది.

జూన్ 2025 - అమెరికా- ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఆ సమయంలో, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసింది. దాని అణు కార్యక్రమం తనకు ముప్పుగా పేర్కొంది. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థలు ఎటువంటి ఆధారాలు కనుగొననప్పటికీ, అమెరికా కూడా ఇందులో చేరింది. ఆ తరువాత ఇరాన్ లో మొత్తం అణ్వాయుధాలను నాశనం చేశామని ట్రంప్ ప్రకటించారు.

ఫిబ్రవరి 2026 - అమెరికా - ఇరాన్ మళ్ళీ అణు ఒప్పందం గురించి చర్చించుకుంటున్నాయి. ఒప్పందం దాదాపు పూర్తయింది. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా ట్రంప్‌ను మళ్ళీ ఇరాన్‌పై దాడి చేయమని ఒప్పించాయి. ట్రంప్ మరోసారి నెతన్యాహును ఆపే విషయంలో విఫలం అయినట్లు నిపుణులు భావిస్తున్నారు.

ఈ యుద్ధం వెనుక నెతన్యాహు రెండు ప్రధాన లక్ష్యాలు..

1. అమెరికా - ఇరాన్ మధ్య ఒప్పందం కుదరకుండా ఆపడం

అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడటం ఇజ్రాయెల్ కోరుకోలేదని విదేశీ వ్యవహారాల నిపుణులు అంటున్నారు. ఇరాన్‌పై దాడి చేయడానికి ఇదే సరైన సమయం, ఎందుకంటే అది ప్రస్తుతం చాలా బలహీనంగా ఉంది. అమెరికా కారణంగా ప్రపంచంలో అనేక ఆంక్షలకు గురైంది.

ఒకవేళ ఇరాన్ - అమెరికా మధ్య ఒక ఒప్పందం కుదిరితే, ఈ ఆంక్షలు ఎత్తివేసే అవకాశం ఉంది. అలాగే, ఇరాన్ అనేక వాణిజ్య ప్రయోజనాలను పొందగలదు. అందువల్ల, ఈ ఒప్పందం జరగకుండా నిరోధించడానికి ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్‌పై దాడి చేయాలని కోరుకుంది.

బ్రిటిష్ వార్తాపత్రిక 'ది గార్డియన్' లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం, ఇజ్రాయెల్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఇజ్రాయెల్ మొత్తం ఆపరేషన్ ప్రారంభం నుండే అమెరికా ఏదో ఒక సమయంలో ఇరాన్‌పై యుద్ధంలో చేరుతుందనే కచ్చితమైన నమ్మకంపైనే ఆధారపడి ఉందని అన్నారు.

2. మధ్యప్రాచ్యంలో అతిపెద్ద ప్రత్యర్థి అయిన ఇరాన్‌ను బలహీనపరచడం

ఇజ్రాయెల్ పాలస్తీనాలో హమాస్‌ను దాదాపుగా తుడిచిపెట్టేసింది. చారిత్రక విధానాలకు విరుద్ధంగా, చాలా అరబ్ దేశాలు ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో పాలస్తీనా వైపు నిలబడలేదు. ఆ దేశాలు రెండు వైపుల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికే పరిమితం అయ్యాయి.

హమాస్‌తో పాటు, లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలు వంటి ఉగ్రవాద సంస్థల నుండి ఇజ్రాయెల్ బెదిరింపులను ఎదుర్కొంటోంది. కానీ, ప్రస్తుతం ఇవి కూడా గణనీయంగా బలహీనపడ్డాయి. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్‌కు సవాలుగా ఉన్న ఏకైక దేశం ఇరాన్. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాటంలో ఇరాన్ హౌతీలు, హిజ్బుల్లాలకు డబ్బు, ఆయుధాలతో మద్దతు ఇస్తోంది.

అందుకే ఇరాన్‌ను బలహీనపరచడమే ఇజ్రాయెల్ ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్‌లోని ఒక ప్రభుత్వం ఇస్లామిక్ ముల్లాలను ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలు కలిగి ఉన్న లేదా కనీసం దానిని శత్రువుగా పరిగణించని వ్యక్తితో భర్తీ చేస్తే అది ఇజ్రాయేల్ కు కేక్ మీద ఐసింగ్ లా అవుతుంది.

ఈ లక్ష్యాలను నెరవేర్చుకోవాలంటే అమెరికా మద్దతు తప్పనిసరి. ఇతర ముస్లిం దేశాలు ఎలానూ ఇరాన్ ను సమర్ధించవు. ఎందుకంటే, మధ్యప్రాచ్యంలోని ముస్లిం దేశాలు సున్నీ-షియా బైనరీగా విడిపోయాయి. ఈ ప్రాంతంలో ఇరాన్‌తో పాటు, ఇరాక్, లెబనాన్, సిరియా షియాలకు మెజారిటీ దేశాలు. అయితే, ఈ దేశాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అంతర్గత అధికార పోరాటాలతో ఇబ్బంది పడుతున్నాయి. ఇక మిగిలిన దేశాలు (సున్నీ మెజారిటీ దేశాలు) అమెరికాతో కలిసి ఉంటున్నాయి. అందువల్ల సరిగ్గా ఈ సమయంలోనే ఇరాన్ ను దెబ్బకొట్టాలనేది నేతన్యుహు ప్లాన్. దానికోసమే పావులు కదిపారు. అమెరికాను యుద్ధంలోకి లాక్కొచ్చారు. ఖమేనీని హతం చేశారు.

ఖమేనీ మరణంతో ఇరాన్.. ఇజ్రాయేల్ కి దాసోహం అంటుందా? ఇది ఇప్పటి పెద్ద ప్రశ్న.

Show Full Article
Print Article
Next Story
More Stories