US Visa: అమెరికా వీసాలపై కొత్త షాకింగ్ నిబంధనలు.. 15,000 డాలర్లు కట్టాల్సిందే..!

US Visa: అమెరికా వీసాలపై కొత్త షాకింగ్ నిబంధనలు.. 15,000 డాలర్లు కట్టాల్సిందే..!
x

US Visa: అమెరికా వీసాలపై కొత్త షాకింగ్ నిబంధనలు.. 15,000 డాలర్లు కట్టాల్సిందే..!

Highlights

US Visa: అమెరికా వలసదారులపై మరింత కఠిన ఆంక్షలు తీసుకొస్తోంది. బిజినెస్‌ (B-1), టూరిస్ట్‌ (B-2) వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ పౌరులపై తాజాగా భారీ భారం పడనుంది.

US Visa: అమెరికా వలసదారులపై మరింత కఠిన ఆంక్షలు తీసుకొస్తోంది. బిజినెస్‌ (B-1), టూరిస్ట్‌ (B-2) వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ పౌరులపై తాజాగా భారీ భారం పడనుంది. ఈ క్రమంలో, దరఖాస్తుదారులు వీసా మంజూరైన తర్వాత అమెరికాలోకి ప్రవేశించాలంటే, కనీసం USD 5,000 నుంచి 15,000 వరకు (అంటే సుమారు రూ. 4.2 లక్షలు నుంచి రూ. 12.5 లక్షల వరకు) బాండ్‌ను షూరిటీగా సమర్పించాల్సి ఉండనుంది.

ఫెడరల్ రిజిస్ట్రీలో నోటీసు విడుదలకు సిద్ధం

ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రకటించనుంది. ఫెడరల్ రిజిస్ట్రీలో ఈ నోటీసును మంగళవారం (స్థానిక కాలమానం ప్రకారం) విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ 12 నెలల పైలట్ ప్రోగ్రామ్ అమలులోకి రావడానికి 15 రోజులు పడే అవకాశం ఉంది.

చట్ట విరుద్ధంగా ఉంటే బాండ్ రీఫండ్ కాదు

ఈ కొత్త నిబంధనల ప్రకారం, వీసా గడువు ముగిసిన తర్వాత తిరిగి దేశం విడిచి వెళ్లే అభ్యర్థులకు షూరిటీగా చెల్లించిన బాండ్ మొత్తాన్ని తిరిగి ఇవ్వనున్నారు. అయితే వీసా గడువు మించిపోయినా దేశం విడిచి వెళ్లని వారు, లేదా చట్ట ఉల్లంఘనలకు పాల్పడినవారికి రీఫండ్‌ లభించదు.

ఏ దేశాలపై వర్తిస్తుంది?

ఈ బాండ్ నిబంధన ప్రతి దేశానికి వర్తించదు. అమెరికా విదేశాంగశాఖ త్వరలోనే షూరిటీ బాండ్ వర్తించే దేశాల జాబితాను విడుదల చేయనుంది. ప్రస్తుతం వీసా వేవర్‌ ప్రోగ్రామ్‌లో ఉన్న 42 దేశాలకు ఈ షూరిటీ మినహాయింపు ఇవ్వనున్నట్లు స్పష్టమైంది. వీటిలో మెజారిటీ యూరోపియన్ దేశాలు కాగా, కొన్ని ఆసియా, మధ్యప్రాచ్య దేశాలూ ఉన్నాయి.

నూతన నిబంధనల వెనుక కారణం

దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అమెరికా ట్రంప్ యంత్రాంగం తెలిపింది. వీసా గడువు పూర్తయిన తరువాత అమెరికా విడిచి వెళ్లకుండా ఉండే అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ఈ మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇదివరకే ట్రంప్ 2020లో ఈ బాండ్ నిబంధనను ప్రకటించినా, కోవిడ్-19 వల్ల అది అమలులోకి రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories