ఇజ్రాయెల్ ఘాటుగా దాడి.. భూగర్భ బంకర్‌లో ఉన్న ఇరాన్ టాప్ ఆఫీసర్లు మృతి..! నతాంజ్ అణు కేంద్రం నాశనం..!

ఇజ్రాయెల్ ఘాటుగా దాడి.. భూగర్భ బంకర్‌లో ఉన్న ఇరాన్ టాప్ ఆఫీసర్లు మృతి..! నతాంజ్ అణు కేంద్రం నాశనం..!
x

ఇజ్రాయెల్ ఘాటుగా దాడి.. భూగర్భ బంకర్‌లో ఉన్న ఇరాన్ టాప్ ఆఫీసర్లు మృతి..! నతాంజ్ అణు కేంద్రం నాశనం..!

Highlights

ఇజ్రాయెల్ తాజా దాడిలో ఇరాన్‌ టాప్ ఎయిర్‌ఫోర్స్‌ నేతలు భూగర్భ సమావేశంలో హతమయ్యారు. నతాంజ్ అణు శుద్ధి కేంద్రం కూడా పూర్తిగా ధ్వంసమైంది. పూర్తి సమాచారం చదవండి...

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ఉదృతం అయ్యాయి. ఈసారి మాత్రం దాడి తీవ్రత భారీగా ఉండటంతో.. ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు జరిపిన భూగర్భ దాడిలో ఇరాన్ టాప్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు పలువురు మృతి చెందారు.

💣 అండర్‌గ్రౌండ్ బంకర్‌ టార్గెట్‌గా దాడి.. ఐఆర్‌జీసీ అగ్రనాయకులపై దెబ్బ

ఇరాన్ ఐఆర్‌జీసీ (IRGC) ఎయిర్ ఫోర్స్ టాప్ బ్రాస్ భూగర్భ భద్రమైన ప్రాంతంలో సమావేశం జరుగుతుండగా, ఇజ్రాయెల్ గగనతల దళం (IDF) టార్గెట్ చేస్తూ బాంబులు వేసింది.

ఈ దాడిలో చనిపోయినవారిలో:

  • IRGC చీఫ్ సలామీ
  • ఇరాన్ ఆర్మీ చీఫ్ మహమ్మద్ బాఘెరీ
  • ఖాతమ్ అల్ అన్‌బియా హెడ్‌క్వార్టర్స్ చీఫ్ అలీ రషీద్
  • ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు అలీ షంఖాని

అంటూ ప్రముఖ నేతల పేర్లు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గలాంట్ కట్జ్ స్వయంగా ధృవీకరించారు.

⚠️ ఇజ్రాయెల్ స్పష్టం: నతాంజ్ అణు కేంద్రం భారీగా ధ్వంసం

ఇరాన్ అణు శాస్త్ర కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచిన నతాంజ్ అణు శుద్ధి కేంద్రం కూడా ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) వెల్లడించింది.

IDF ప్రకారం:

బహుళ అంతస్తుల్లోని సెంట్రిఫ్యూజ్‌లు పూర్తిగా ధ్వంసం

ఎలక్ట్రికల్ రూములు, సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తుడిపాటు

మిలిటరీ గ్రేడ్ యురేనియం తయారీ వ్యవస్థలు దెబ్బతిన్నాయి

ఈ కేంద్రంలో ఉండే పరికరాలు ద్వారా అణ్వాయుధాల ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

🌍 ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం

ఈ దాడి అనంతరం మిడిలీస్ట్ అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. నాటో, యూఎన్ వంటి అంతర్జాతీయ సంస్థలు జాగ్రత్తగా ఈ పరిణామాలపై నిగాహు పెడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories