North Korea: ఈ సారి ఫారెన్‌ ట్రిప్స్‌లో ఉత్తరకొరియాను చేర్చుకోవచ్చు!! రీసార్ట్ బీచ్ పేరుతో కిమ్ టూరిజం ప్రాజెక్ట్

North Korea to open beach resort as Kim bets on tourism
x

North Korea: ఈ సారి ఫారెన్‌ ట్రిప్స్‌లో ఉత్తరకొరియాను చేర్చుకోవచ్చు!! రీసార్ట్ బీచ్ పేరుతో కిమ్ టూరిజం ప్రాజెక్ట్

Highlights

North Korea: ఉత్తరకొరియా.. ఈ పేరు వింటే ఆ దేశంలోని ప్రజలకు మాత్రమే కాదు ప్రపంచంలోని వాళ్లందరికీ కూడా హడలే.

North Korea: ఉత్తరకొరియా.. ఈ పేరు వింటే ఆ దేశంలోని ప్రజలకు మాత్రమే కాదు ప్రపంచంలోని వాళ్లందరికీ కూడా హడలే. విధి బాలేక ఎవరైనా ఆ దేశంలోకి అడుగుపెట్టారంటే..అతను మళ్లీ తిరిగి వస్తాడో లేదో ఎవరకీ తెలియదు. అంటు పాలన ఉన్న ఆ రాజ్యంలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ కొత్త టూరిజం ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చాడు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 54 హోటళ్లు, సినిమా హాళ్లు పబ్‌లను దాదాపు 20వేల మంది పర్యాటకుల కోసం ఏర్పాటు చేశారు.

కోవిడ్ 19 తర్వాత ఉత్తరకొరియా సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. ఈ సమయంలో ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా అందరికీ తెలిసింది. కానీ ఉత్తరకొరియాలో ఏం జరిగిందో, అసలు ఆ దేశంలో ఎంతవరకు కరోనా వచ్చింది అన్న విషయాలు ఎవరికీ తెలియలేదు. అయితే ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశ చరిత్రలో ఎప్పుడూ తీసుకోలేని ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ఆ దేశంలో రిసార్ట్ బీచ్ పేరుతో ఒక పెద్ద ప్రాజెక్ట్‌ను చేపట్టారు.

ఉత్తరకొరియాలో సోషల్ మీడియా ఉండదు. అలాగే టీవీలో వచ్చే ప్రసారాలు కూడా ప్రభుత్వం మేరకే వస్తాయి. అవే ప్రజలు చూడాలి. ఈ దేశంగానీ, ఈ దేశంలో ఉన్న ప్రజలుగానీ ఏ ఇతర దేశాలతో ఎటువంటి సబంధం పెట్టుకోకూడదు. ఇది అక్కడ ఒక రూల్ మాత్రమే కాదు. ఆ దేశాధ్యక్షుడు చేసిన శాసనం. అటువంటి వాతావరణం ఉన్న ఉత్తరకొరియాలోని కల్మాతీరంలో ఇప్పుడు రీసార్ట్ బీచ్ పేరుతో వచ్చిన ప్రాజెక్ట్‌లో 54 హోటళ్లు, సినిమా హాళ్లు, పబ్‌లు, వాటర్ పార్కులవంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. దాదాపు 20వేల మంది టూరిస్టులు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసే విధంగా కిమ్ ఏర్పాట్లు చేశాడు. అంతేకాదు ఈ ప్రాంతానికి అంతర్జాతీయ కనెక్టివటీతో పాటు, రైలు సదుపాయం కూడా ఉంది. దేశంలో టూరింజను పెంచాలనే ఉద్దేశంతో కిమ్ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఇక్కడ వరకు బానే ఉంది. కానీ ఈ సదుపాయం అంతర్జాతీయ టూరిస్టులకు కూడా ఉందా? లేదా? అన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

ఉత్తరకొరియా మొదటి నుంచీ విదేశీ పర్యాటకాన్ని నిషేధించింది. అయితే ఈ మధ్య చైనా, రష్యా పర్యాటకులను మాత్రమే ఆ దేశానికి ఆహ్వానించింది. అది కూడా పరిమిత సంఖ్యలోనే టూరిస్టులను అనుమతించింది. అయితే ఇప్పుడు ఈ రీసార్ట్ బీచ్ ఇతర దేశాల టూరిస్టులు ఉన్నారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories