India-Pakistan: ఇండియాకి, పాకిస్థాన్‌కు ఉన్న తేడా అది.. ముందు అద్దంలో మీ ముఖం చూస్కోండి బ్రో!

India-Pakistan
x

India-Pakistan: ఇండియాకి, పాకిస్థాన్‌కు ఉన్న తేడా అది.. ముందు అద్దంలో మీ ముఖం చూస్కోండి బ్రో!

Highlights

India-Pakistan: ఇక 2023కి వచ్చేసరికి భారత్‌ GDP పాకిస్థాన్‌ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా రికార్డయింది.

India-Pakistan: ఒకవైపు కుప్పలుతిప్పలగా అప్పులు.. మరోవైపు నిద్రపోతున్న ఆర్థిక వ్యవస్థ పాకిస్థాన్‌ పట్టిపీడిస్తున్నాయి. కానీ అదే సమయంలో పాకిస్థాన్‌ బాంబులు కొనుగోలు చేస్తుండడం నిజంగా విడ్డూరంగా చెప్పాలి. ఎందుకంటే పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఇండియా, పాక్‌ మధ్య పరిస్థితులు దారుణంగా మారిపోవడంతో పాకిస్థాన్‌ ఆయుధాల కొనుగోలుపై దృష్టిపెట్టిందట.. ఇటు ఇండియా మాత్రం యుద్ధానికి సిద్ధమవుతూనే ఆర్థికంగానూ దూసుకెళ్తోంది.

వాస్తవానికి 1980 వరకు ఆర్థిక విషయాల్లో పాకిస్థాన్‌ ఇండియాతో కాస్త సమానంగానే. అప్పట్లో పాక్‌ ఆర్థికంగా వృద్ధి బాటలోనే నడిచేది. కానీ 1990ల తరువాతే.. పాక్‌ స్థితిగతులు మారిపోయాయి. ఉగ్రవాదం ఆ దేశంలో ఘోరంగా తిష్టవేసుకోంది. వారికి ప్రభుత్వ అండదండలు కూడా లభించాయి. అదే సమయంలో భారత్‌ ఆర్థిక సంస్కరణలతో ప్రపంచానికి తలుపులు తెరిచింది. ఆ దశలో పాకిస్థాన్‌ మాత్రం భారత్‌ను దెబ్బతీయాలనే ఉన్మాద ఆలోచనతో కశ్మీర్‌లో మిలిటెన్సీని పెంచడం మొదలుపెట్టింది. ఇద్దరి మధ్య ఆర్థిక తేడాలు మొదలైది అప్పుడే. ఇక 2023కి వచ్చేసరికి భారత్‌ GDP పాకిస్థాన్‌ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా రికార్డయింది.

ఒక్కొక్క భారత పౌరుడికి వచ్చే ఆదాయం... అంటే పర్‌ క్యాపిటా GDP కూడా 1.4 రెట్లు ఎక్కువ. అంతే కాదు.. పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ కేవలం వృద్ధిలోనే కాదు, స్థిరత్వంలో కూడా చేతులెత్తేసింది. అటు అప్పులు కూడా ఇండియాకు కాస్త తగ్గాయనే చెప్పాలి. ఇటు పాక్‌ అప్పులు మాత్రం క్రమంగా పెరిగాయి. ఇక IMF లాంటి సంస్థలు.. పాకిస్థాన్‌ కోసం తలుపులు తెరిచే పరిస్థితిలో ఉన్నా.. దేశ పరిపాలనలో మార్పులేవీ రావడం లేదు. ఇదంతా చూస్తే ఓ విషయం మాత్రం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. పాకిస్థాన్‌ ప్రభుత్వం తన స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటోంది. అసలు ప్రజలను పట్టించుకోవడంలేదు. అణుబాంబుల మాటలతో ధైర్యం చూపించే పాకిస్థాన్‌.. వాస్తవానికి తన అంతర్యుద్ధంలోనే ఓడిపోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories