Pakistan: పిల్లలను మాడ్చి చం*పుతున్న పాకిస్థాన్‌.. సైనికుల కోసం మాత్రం వేల కోట్లు ఖర్చు!

Pakistan
x

Pakistan: పిల్లలను మాడ్చి చం*పుతున్న పాకిస్థాన్‌.. సైనికుల కోసం మాత్రం వేల కోట్లు ఖర్చు!

Highlights

Pakistan: నిజానికి 1960ల నుంచే పాకిస్థాన్‌ ఇదే ధోరణి కొనసాగిస్తోంది. 1998లో అణుపరీక్షల తర్వాత సైనిక ఖర్చుల విషయంలో పాకిస్థాన్‌ కాస్త తగ్గినా.. ఇప్పటికీ అది భారత్‌తో పోల్చితే భారీగానే నిధులు కేటాయిస్తోంది.

Pakistan: నిద్రపోతున్న ఎవరికైనా కలలు రావడం సహజం.. కానీ కలలే నిజమని నమ్ముతూ ఉండిపోతే.. మేల్కొనడం అసాధ్యం అవుతుంది. పాకిస్థాన్‌ను చూస్తే ఈ విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఓవైపు అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్టున్నారు.. కనీసం బ్రెడ్ కూడా తినలేని దుస్థితి వారిది. ఇటు పాకిస్థాన్‌ ప్రభుత్వం మాత్రం యుద్ధాల కోసం, గొడవల కోసం బాంబులు సిద్ధం చేస్తోంది. కరువు కొట్టుకుంటున్న ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించలేకపోతున్న పాక్‌ ప్రభుత్వం.. బుల్లెట్ల శబ్దాల్లో తన గొప్పతనాన్ని వెతుక్కుంటోంది. మాటల్లో దొంగబుద్ధి.. చేతల్లో మానవత్వ హననం పాక్‌ నైజం. అణువాయుధాలతో భయం చూపించే ఈ దేశం తన ఇంట్లోనే బతకలేని స్థితిలోకి కనిపిస్తోంది. దిగజారిన ఆర్థిక స్థితి, తలకిందులైన పరిపాలనతో అల్లాడిపోతోంది. అయితే ఇంత జరుగుతున్నా పాకిస్థాన్‌ మాత్రం ఆయుధాలపై భారీగా ఖర్చుపెడుతోంది? ఎందుకిలా చేస్తోంది?

2023లో ప్రపంచ బ్యాంక్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, పాకిస్థాన్‌ తన మొత్తం ప్రభుత్వ వ్యయాల్లో 14.45 శాతాన్ని సైనిక ఖర్చులకు కేటాయించింది. అదే సమయంలో భారత్‌ మాత్రం కేవలం 8.15 శాతం మాత్రమే ఖర్చు చేసింది. ఇక GDPపరంగా చూసినా సైనిక ఖర్చుల విషయంలో పాకిస్థాన్‌ లిమిట్‌ దాటి ఖర్చు చేస్తుందని లెక్కలు చూస్తే అర్థమవుతుంది. 3.5శాతానికి మించి సైనిక అవసరాల కోసం పాకిస్థాన్‌ ఖర్చు చేస్తుంటే.. భారత్‌ మాత్రం 2.8 శాతం వద్ద ఆగింది. అంటే ఇండియాలో వంద రూపాయలు సంపాదిస్తే అందులో 2 రూపాయల 80 పైసలు రక్షణ కోసం ఖర్చు చేస్తోంది. పాకిస్థాన్‌ మాత్రం అదే వంద రూపాయలలో 3 రూపాయల 50 పైసలు ఖర్చు చేస్తోంది.

నిజానికి 1960ల నుంచే పాకిస్థాన్‌ ఇదే ధోరణి కొనసాగిస్తోంది. 1998లో అణుపరీక్షల తర్వాత సైనిక ఖర్చుల విషయంలో పాకిస్థాన్‌ కాస్త తగ్గినా.. ఇప్పటికీ అది భారత్‌తో పోల్చితే భారీగానే నిధులు కేటాయిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories