PM Modi: నేడు ఫ్రాన్స్ కు ప్రధాని మోదీ.. AI శిఖరాగ్ర సమావేశానికి హాజరు

PM Modi: నేడు ఫ్రాన్స్ కు ప్రధాని మోదీ.. AI శిఖరాగ్ర సమావేశానికి హాజరు
x
Highlights

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజులపాటు ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 10 నుండి 12 వరకు ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటన...

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజులపాటు ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 10 నుండి 12 వరకు ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం ఫ్రాన్స్ నిర్వహించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు. ఆయన ఈ సమావేశానికి సహ-అధ్యక్షత వహించనున్నారు.పర్యటనలో మొదటి రోజు, అంటే ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రం, ప్రధాన మంత్రి మోదీ ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే ప్రభుత్వాధినేతలు/దేశాధినేతలు, ఇతర ప్రముఖ నాయకులకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇచ్చే విందులో పాల్గొంటారు. ఈ విందు లక్ష్యం దేశాల అధినేతల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు వివిధ ప్రపంచ అంశాలపై చర్చించడం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రం పారిస్ చేరుకుంటారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రా తెలిపారు. ఆ సాయంత్రం ఒక ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందు ప్రసిద్ధ ఎలిసీ ప్యాలెస్‌లో జరుగుతుంది. ఇక్కడ టెక్ రంగానికి చెందిన అనేక మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు (CEOలు) కూడా హాజరవుతారు.ఇది మూడవ ఉన్నత స్థాయి AI శిఖరాగ్ర సమావేశం అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. గతంలో, 2023లో UKలో 2024లో దక్షిణ కొరియాలో ఇలాంటి సమావేశాలు నిర్వహించారు. ఈ శిఖరాగ్ర సమావేశం ద్వారా, సాంకేతిక రంగంలో భారతదేశం, ఫ్రాన్స్ మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories