Russia Ukraine peace talks: రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చలకు కీలక మలుపు.. జెలెన్‌స్కీకి మాస్కో ఆహ్వానం

Russia Ukraine peace talks: రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చలకు కీలక మలుపు.. జెలెన్‌స్కీకి మాస్కో ఆహ్వానం
x

Russia Ukraine peace talks: రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చలకు కీలక మలుపు.. జెలెన్‌స్కీకి మాస్కో ఆహ్వానం

Highlights

చర్చల కోసం మాస్కో రావాల్సిందిగా జెలెన్‌స్కీకి క్రెమ్లిన్ ఆహ్వానం యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ ముమ్మర యత్నాలు

Russia Ukraine peace talks: నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ వేదికలపై దౌత్య ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. రష్యా ప్రభుత్వం మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని శాంతి చర్చల కోసం మాస్కో రావాల్సిందిగా ఆహ్వానించింది. అయితే జెలెన్‌స్కీ గతంలోనే ఇలాంటి ఆహ్వానాన్ని తిరస్కరించారు. ప్రతిరోజూ క్షిపణి దాడులు చేస్తున్న దేశ రాజధానికి తాను వెళ్లలేనని, చర్చలు జరగాలంటే పుతిన్ 'కీవ్'కు రావాలని డిమాండ్ చేశారు. తాజా ఆహ్వానంపై ఉక్రెయిన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా చేపట్టిన దౌత్యవేత్తల చర్చలు అబుదాబిలో సాగుతున్నాయి. ఇటీవల జరిగిన మొదటి రౌండ్ చర్చలు నిర్మాణాత్మకంగా సాగాయని, రెండో రౌండ్ చర్చలు ఫిబ్రవరి 1న జరగనున్నాయని అధికారులు తెలిపారు. చాలా మంచి పరిణామాలు జరుగుతున్నాయని, ఈ చర్చల పురోగతిపై ట్రంప్ ట్వీట్ చేశారు.


ఉక్రెయిన్ లో ప్రస్తుతం మైనస్ డిగ్రీల చలి తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో లక్షలాది మంది ప్రజలు అంధకారంలో మగ్గిపోవడంతో, మానవతా దృక్పథంతో విద్యుత్ గ్రిడ్లపై దాడులు ఆపాలని ట్రంప్ చేసిన విజ్ఞప్తికి రష్యా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనిపై రష్యా నేరుగా స్పందించనప్పటికీ, వారం రోజుల పాటు 'హ్యుమానిటేరియన్ పాజ్ ఇచ్చే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.


శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నా, కొన్ని అంశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అలాగే, రష్యా ఆక్రమించిన సుమారు 20 శాతం ఉక్రెయిన్ భూభాగాలైన డోనెట్స్క్ రీజియన్ భవిష్యత్తుపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. యుద్ధం తర్వాత ఉక్రెయిన్‌కు అమెరికా ఇచ్చే భద్రతా హామీల పట్ల రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జపోరిజియా అణు ప్లాంట్ నియంత్రణ ఎవరి దగ్గర ఉండాలనేది ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories