Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆపరేషన్‌ డెవిల్ హంట్.. వణికిపోతున్న ఆ వర్గం.. ఎంతమంది అరెస్ట్ అంటే?

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆపరేషన్‌ డెవిల్ హంట్.. వణికిపోతున్న ఆ వర్గం.. ఎంతమంది అరెస్ట్ అంటే?
x
Highlights

Bangladesh: బంగ్లాదేశ్ లో యూనస్ ప్రభుత్వం ఆపరేషన్ డెవిల్ హంట్ పేరుతో దాడులు చేపడుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీ గుర్తులు,...

Bangladesh: బంగ్లాదేశ్ లో యూనస్ ప్రభుత్వం ఆపరేషన్ డెవిల్ హంట్ పేరుతో దాడులు చేపడుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీ గుర్తులు, అస్తులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడుతుంది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావొస్తున్న నేపథ్యంలో దేశంలో అస్థిరతను క్రియేట్ చేసేవారిని ఏరివేస్తామని బంగ్లాలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఆర్మీ, పోలీసులు, ప్రత్యేక భద్రతా యూనిట్లు కలిసి ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు 13వందల మందిని అరెస్టు చేశాయి.

ఇటీవల షేక్ హసీనా కుటుంబ భవనాలపై కొందరు దాడులు చేసి ధ్వంసం చేశారు. బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మన్ స్మారక భవనంపై దాడికి పాల్పడ్డారు. దాంతో భవనం పూర్తిగా దెబ్బతిని మ్యూజియం కూడా ధ్వంసం అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ విజ్నప్తి చేశారు. ఇటీవల ఓ మంత్రిపై దాడికి ఈ గ్యాంగ్ లే కారణమని తెలుస్తోంది. ఆపరేషన్ డెవిల్ హంట్ ను గాజీపుర్ లో మొదలుపెట్టి దేశం మొత్తం అమలు చేస్తామని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రజల భద్రతలో భాగంగానే దీనిని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 5న దేశం వీడిన షేక్ హసీనా..భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హసీనాతోపాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇప్పటికే ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అలాగే ఈ కొత్త ఆపరేషన్ కూడా హసీనా, అవామీలీగ్ మద్దతుదారులపైనే విమర్శలు వస్తున్నాయి. వీటిని బంగ్లా హోంమంత్రి తోసిపుచ్చారు. డెవిల్ అంటే దేశ వ్యతిరేక శక్తులని అర్థం అన్నారు. దేశాన్ని అస్థిరపరిచే కుట్రదారులు, చట్టాన్ని ఉల్లంఘించే, తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవారే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories