Solar Storm Warning: భానుడి విశ్వరూపం: నిప్పులు చిమ్ముతున్న సూర్యుడు.. రేడియో బ్లాక్అవుట్ దిశగా భూగోళం?

Solar Storm Warning: భానుడు గత కొద్దిరోజులుగా అగ్నిజ్వాలలు కక్కుతూ ఉగ్రరూపం దాల్చడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
Solar Storm Warning: భానుడు గత కొద్దిరోజులుగా అగ్నిజ్వాలలు కక్కుతూ ఉగ్రరూపం దాల్చడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. సూర్యుని ఉపరితలంపై సంభవిస్తున్న ఈ తీవ్రమైన సౌర అలజడుల వల్ల రేడియో బ్లాక్ అవుట్ ఏర్పడే ప్రమాదం ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) హెచ్చరించింది.
ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పు:
సౌర తుఫానులు భూమి దిశగా సాగితే అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలు దెబ్బతినే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్కు చెందిన 50 క్రియాశీల ఉపగ్రహాలను ఇస్రో అధికారులు అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఈ తుఫానుల ప్రభావం వల్ల కమ్యూనికేషన్, నావిగేషన్ వ్యవస్థలతో పాటు టీవీ సిగ్నల్స్, విద్యుత్ గ్రిడ్లు మరియు రాడార్ వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఇస్రో టెలిమెట్రీ విభాగం డైరెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.
సూర్యుని కోపానికి అసలు కారణం:
సూర్యుని ఉపరితలంపై 'యాక్టివ్ రీజియన్ 14366' అనే అయస్కాంత సంక్లిష్ట మచ్చల సమూహం ఏర్పడటం వల్ల ఈ అలజడి మొదలైంది. ఈ ఏడాదిలోనే అత్యంత శక్తిమంతమైన ఎక్స్8.1 (X8.1) తరగతి అగ్నిజ్వాలలు ఈ నెల 1, 2 తేదీల్లో వెలువడ్డాయని నాసా (NASA) ధ్రువీకరించింది. ఇవి కాంతి వేగంతో విద్యుదయస్కాంత రేడియేషన్ను విడుదల చేస్తున్నాయి.
భారత్ సిద్ధం:
రేడియో బ్లాక్ అవుట్ సంభవిస్తే విమానాలు, నౌకల రాకపోకలకు అంతరాయం కలగవచ్చు. అయితే, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని ఇస్రో స్పష్టం చేసింది. గ్రౌండ్ స్టేషన్లు మరియు మిషన్ కంట్రోల్ కేంద్రాలను ఇప్పటికే అప్రమత్తం చేశామని, వ్యవస్థలు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేసేందుకు టీమ్స్ సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



