Gaza: ఇది యుద్ధం కాదు.. ఉన్మాదం.. కుప్పలుకుప్పలగా శవాలు.. గాజాలో ఎన్ని వేలమంది చనిపోయారో తెలిస్తే మైండ్ బ్లాక్!

srael kills at least 115 Palestinians in first day of major offensive in Gaza telugu news
x

Gaza: ఇది యుద్ధం కాదు.. ఉన్మాదం.. కుప్పలుకుప్పలగా శవాలు.. గాజాలో ఎన్ని వేలమంది చనిపోయారో తెలిస్తే మైండ్ బ్లాక్!

Highlights

Gaza: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమాన్ని సృష్టిస్తూన్న సంగతి తెలిసిందే. గాజాలోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతోంది. గత మూడు రోజులుగా వైమానిక దాడులతో...

Gaza: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమాన్ని సృష్టిస్తూన్న సంగతి తెలిసిందే. గాజాలోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతోంది. గత మూడు రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఈ క్రమంలో శుక్రవారం ఒక్కరోజే ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఏకంగా 115 మంది పాలస్తీనియన్లు మరణించారు. గాజా శివారులోని దేర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్ నగరంతో సహా గాజా వ్యాప్తంగా గురువారం రాత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ సేనలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఈ దాడుల్లో 115 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడినట్లు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ మినహా గల్ఫ్ దేశాల పర్యటన ముగిసిన వెంటనే గాజాపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. గాజా స్ట్రిప్ సరిహద్దులపై ఇజ్రాయెల్ దిగ్బంధం మూడు నెలలుగా కొనసాగుతోంది.

ఇక దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై బుధవారం, గురువారం మధ్య రాత్రి ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో 5 మంది మరణించారు. మరణించినవారిలో ఓ జర్నలిస్టు కుటుంబ సభ్యుల్లో 11 మంది కూడా ఉన్నారు. అంతకుముందు మంగళవారం రాత్రి బుధవారం తెల్లవారుజామున మధ్య జరిగిన దాడుల్లో 22 మంది చిన్నారులు సహా మొత్తం 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గత 3 రోజుల వ్యవధిలోనే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో 180 మందికిపైగా మరణించారు. శుక్రవారం మరో 115 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపితే గాజా పోరు మొదలైనప్పటి నుంచి ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియుల సంఖ్య 53వేలు దాటినట్లు గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో లక్షలాది మంది గాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories