NASA: మళ్లీ స్టార్​లైన్​ర్​లోనే అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం..ప్రకటించిన సునీతా విలియమ్స్

NASA: మళ్లీ స్టార్​లైన్​ర్​లోనే అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం..ప్రకటించిన సునీతా విలియమ్స్
x
Highlights

NASA: బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో మళ్లీ ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామని నాసా వ్యోమగాములు బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ తెలిపారు. మునుపటి...

NASA: బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో మళ్లీ ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామని నాసా వ్యోమగాములు బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ తెలిపారు. మునుపటి సమస్యలు పూర్తిగా సర్థుకున్నాయి.. మిషన్ విజయవంతం అవుతుందని విల్మోర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల తర్వాత ఈ ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షం నుండి తిరిగి తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్ కృషి చేసింది. నిజానికి, ముందుగా వారు బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్ ద్వారా తిరిగి రావాల్సి ఉంది. కానీ అది వారిని తీసుకురాకుండానే భూమికి తిరిగి వచ్చింది. దీని వలన వారి తిరిగి రావడం ఆలస్యం అయింది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారి మొదటి విలేకరుల సమావేశంలో, ఇద్దరు వ్యోమగాములు ప్రజల నుండి ఇంత ఆసక్తిని చూసి ఆశ్చర్యపోయారని చెప్పారు. అతను తన ఉద్యోగం మాత్రమే చేస్తున్నానని తన కుటుంబం కంటే మిషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు.

గతంలో తాము తీసుకున్న శిక్షణ మిమ్మల్ని ఐఎస్ఎస్ కు తీసుకెళ్లాల సిద్ధం చేసిందని సునీతా విలియమ్స్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మిషన్ కంట్రోల్ బ్రుందాలు తాము తిరిగి భూమిపైకి రావడంతో పునరావాసం, కొత్త సవాళ్లకు సిద్ధం కావడానికి ఎంతో సహాయం చేశాయన్నారు. తాను భూమిపైకి వచ్చాక ఇప్పటికే మూడు మైళ్లు పరుగెత్తానని తెలిపారు. అయితే అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చాక శరీరంలో కొన్ని మార్పులు ఉంటాయని..దానికి తగ్గట్లు కొన్ని సర్దుబాట్లు అవసరం అన్నారు. తాను మళ్లీ సాధారణ స్థితికి రావడానికి సహాయం చేసిన శిక్షకులకు ఈ సందర్బంగా సునీతా విలియమ్స్ ధన్యవాదాలు తెలిపారు. ఐఎస్ఎస్ లో ఉన్న సమయంలో తమ టాస్క్ ల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని శిక్షణ తీసుకున్నామని తెలిపారు.

మానవ అంతరిక్షయానం దేశాలను ఒక్కతాటిపైకి తీసుకువస్తుందని విల్మోర్ అన్నారు. స్టార్ లైనర్ లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, హీలియం, లీకేజీల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్న నాసా, బోయింగ్ టీమ్స్ నిబద్ధతను ఆయన కొనియాడారు. తమకు నాసాపై ఎంతో నమ్మకం ఉందన్నారు. తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబద్ధతకు సంబంధించి ఇదొక మైలురాయిగా అభివర్ణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories