
Donald Trump: ఖమేనీ మరణం తర్వాత ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump: పశ్చిమాసియా రాజకీయ పటంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో అగ్రరాజ్యం అమెరికా తన తదుపరి వ్యూహాన్ని ప్రకటించింది.
Donald Trump: పశ్చిమాసియా రాజకీయ పటంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో అగ్రరాజ్యం అమెరికా తన తదుపరి వ్యూహాన్ని ప్రకటించింది. ఖమేనీ మృతిని ఇరాన్ అధికారికంగా ధృవీకరించిన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు.
యుద్ధం ఇప్పుడే ఆగదు - ట్రంప్ హెచ్చరిక:
ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యలు ఇప్పుడప్పుడే ముగియవని, కనీసం మరో నాలుగు వారాల పాటు దాడులు నిరంతరాయంగా కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. "ఇది ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న ఆపరేషన్. శాంతి స్థాపన కోసం ఈ యుద్ధం అవసరం" అని ఆయన పేర్కొన్నారు. ఖమేనీని చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తిగా అభివర్ణించిన ట్రంప్, ఆయన మరణం ఇరాన్ ప్రజలకు దక్కిన అసలైన న్యాయమని కొనియాడారు.
దాడులు చేస్తూనే దౌత్యం:
ట్రంప్ తనదైన శైలిలో వైఖరిని ప్రదర్శిస్తూ.. ఒకవైపు బాంబుల మోత కొనసాగిస్తూనే, మరోవైపు ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం గమనార్హం. అంటే ఇరాన్ లొంగివచ్చే వరకు దాడులు ఆపబోమనే సంకేతాలను ఆయన పంపారు.
క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు:
మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. వీటిని 'అక్రమ దాడులు'గా పేర్కొంటూ ప్రతి దాడికి దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో పశ్చిమాసియా అగ్నిగుండంగా మారింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



