Dallas: అక్రమ వలసదారులపై ట్రంప్ హెచ్చరిక

Dallas: అక్రమ వలసదారులపై ట్రంప్ హెచ్చరిక
x

Dallas: అక్రమ వలసదారులపై ట్రంప్ హెచ్చరిక

Highlights

అక్రమ వలసలను ఇక ఎంతమాత్రం ఉపేక్షించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. డాలస్‌లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్యను క్యూబా వలసదారుడు హత్య చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

అక్రమ వలసలను ఇక ఎంతమాత్రం ఉపేక్షించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. డాలస్‌లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్యను క్యూబా వలసదారుడు హత్య చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై ఫస్ట్‌ డిగ్రీ కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ‘అమెరికాను మళ్లీ సురక్షితం’ చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఇకపై అక్రమ వలసదారులపై మెతకవైఖరి అవలంబించబోమని స్పష్టం చేశారు. ‘చంద్ర నాగమల్లయ్య హత్య కేసులో సంచలన విషయాలు నా దృష్టికి వచ్చాయి. డాలస్‌లో మల్లయ్యకు మంచి పేరుంది. అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్య, కుమారుడు చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది. మా దేశానికి సంబంధం లేని, క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు’ అని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్ వేదికలో పోస్టు పెట్టారు.


Show Full Article
Print Article
Next Story
More Stories