US: అమెరికాలో 5.5 కోట్ల విదేశీయుల వీసాల పరిశీలన – ట్రంప్‌ ప్రభుత్వ కీలక ప్రకటన

US: అమెరికాలో 5.5 కోట్ల విదేశీయుల వీసాల పరిశీలన – ట్రంప్‌ ప్రభుత్వ కీలక ప్రకటన
x

US: 55 Million Foreigners’ Visas Under Review – Key Announcement from Trump Administration

Highlights

US Visa Review: అమెరికాలో 5.5 కోట్ల విదేశీయుల వీసాలను ట్రంప్ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తోంది. వీసా ఉల్లంఘనలు, అక్రమ నివాసం, ఉగ్రవాద అనుమానాలపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.

అమెరికాలో ఉన్న సుమారు 5.5 కోట్ల విదేశీయుల వీసా పత్రాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం విడుదల చేసిన ప్రకటనలో, వీసా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు ఈ కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది.

కఠిన చర్యలకు సన్నాహాలు

అమెరికా అధికారుల ప్రకారం –

  1. వీసా కాలపరిమితిని మించి నివసించే వారు
  2. నేరాలకు పాల్పడినవారు
  3. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చినవారు
  4. ప్రజా భద్రతకు భంగం కలిగించిన వారు

ఇవన్నీ ఈ సమీక్షలో గుర్తిస్తే, వారిని తమ స్వదేశాలకు డిపోర్ట్‌ చేయడం అనివార్యం అవుతుందని స్పష్టం చేశారు.

వీసా రివ్యూ ఉద్దేశం

ఈ పరిశీలన ద్వారా అమెరికాలో న్యాయపరమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు మరింత కఠినంగా అమలు అవుతాయని, దేశ భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ట్రంప్‌ ప్రభుత్వం పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories