US-China Trade War: సంద్రంలోనూ అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌..

సంద్రంలోనూ అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌..
x

సంద్రంలోనూ అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌..

Highlights

సంద్రంలోనూ అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌..నౌకలపై ప్రత్యేక ఫీజులు..

ABC MEDIUM. ABC LARGE. ABC EXTRA LARGE. ఇంటర్నెట్ డెస్క్‌: అమెరికా-చైనా మధ్య ఇటీవల వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్న సంగతి తెలిసిందే. బీజింగ్‌పై అదనంగా 100శాతం సుంకాలు (Trump Tariffs) విధిస్తున్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనతో ఇరుదేశాల మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం (US-China Trade War) రాజుకుంది. తాజాగా ఇరుదేశాలు నౌకలపై పరస్పర ప్రత్యేక ఫీజులు ప్రకటించాయి. అమెరికా (USA) యాజమాన్యం నిర్వహణలో ఉన్న నౌకలు, యూఎస్‌ నిర్వహించే లేదా ఆ దేశ జెండాలతో వచ్చే ఓడలపై ప్రత్యేక ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు చైనా మంగళవారం ప్రకటించింది. అయితే, చైనా (China) నిర్మించిన నౌకలకు ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. అటు అమెరికా కూడా నేటినుంచి ఈ ఫీజుల వసూలు ప్రారంభించింది. నేనలా చేసింది నోబెల్‌ కోసం కాదు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టీకరణ. చివరివరకూ పోరాడతాం: చైనా. మరోవైపు, అమెరికా అదనపు సుంకాలపై చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ స్పందించింది. ‘‘వాణిజ్య యుద్ధం (Trade War).. టారిఫ్‌ల అంశంపై మా వైఖరి స్థిరంగా ఉంది. మీరు(అమెరికాను ఉద్దేశిస్తూ) యుద్ధం కోరుకుంటే మేం చివరివరకూ పోరాడతాం. అదే చర్చలు కావాలనుకుంటే మా తలుపులు తెరిచే ఉన్నాయి’’ అని వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఇటీవల చైనా నియంత్రణలు విధించింది. ఇకపై విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఇది ట్రంప్‌ (Donald Trump)నకు కోపం తెప్పించింది. దీంతో బీజింగ్‌పై 100శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అవి నవంబరు 1వ తేదీ నుంచి గానీ, అంతకుముందు నుంచి గానీ అమల్లోకి వస్తాయని తెలిపారు. దీంతో పాటు చైనాకు అమెరికా సంస్థలు ఎగుమతి చేసే కీలక సాఫ్ట్‌వేర్‌ల పైనా నియంత్రణలు విధిస్తామని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories