US Deports: అమెరికా నుంచి 1,563 మంది భారతీయుల బహిష్కరణ – కేంద్రం అధికారిక ప్రకటన

US Deports: అమెరికా నుంచి 1,563 మంది భారతీయుల బహిష్కరణ – కేంద్రం అధికారిక ప్రకటన
x

US Deports: అమెరికా నుంచి 1,563 మంది భారతీయుల బహిష్కరణ – కేంద్రం అధికారిక ప్రకటన

Highlights

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఆరు నెలల్లో 1,563 మంది భారతీయులను వెనక్కి పంపించారని భారత విదేశాంగ శాఖ...

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఆరు నెలల్లో 1,563 మంది భారతీయులను వెనక్కి పంపించారని భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. జనవరి 20 నుంచి జూలై 15, 2025 మధ్య ఈ బహిష్కరణలు జరిగాయని, వీరిలో ఎక్కువ మంది కామర్షియల్ విమానాల ద్వారా భారత్‌కు తిరిగి వచ్చారని విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 15,000 మందికి పైగా భారతీయులు అమెరికా నుంచి బహిష్కరించబడ్డారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల హామీల్లో భాగంగా అక్రమ వలసలపై కఠిన చర్యలు ప్రారంభించగా, అమెరికాలో అక్రమంగా ఉన్న భారతీయుల పౌరసత్వ ధృవీకరణలో భారత్ సహకరించిందని కేంద్రం స్పష్టం చేసింది.

అమెరికా వీసా విషయంలో కూడా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. వీసా పొందిన తర్వాత కూడా తీవ్రంగా స్క్రీనింగ్ కొనసాగుతుందని, ఒక్క తప్పిదంతో వీసా రద్దు అయ్యే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.

ఇటీవల ఇలినాయిస్‌లోని టార్గెట్ స్టోర్‌లో రూ.1.1 లక్షల విలువైన వస్తువులు దొంగిలించిన భారతీయ మహిళ అరెస్టు కావడంతో, అమెరికా దౌత్య కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. దొంగతనం, దాడి, చోరీ వంటి నేరాలు చేయడం వలన వీసా రద్దు అవడమే కాకుండా, భవిష్యత్తులో అమెరికా వీసాలకు అనర్హత వస్తుందని స్పష్టం చేసింది. విదేశీ సందర్శకులు స్థానిక చట్టాలను గౌరవించాలని, నేరాలకు పాల్పడవద్దని అమెరికా అధికారులు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories