Birthright Citizenship: ట్రంప్‎నకు బిగ్ షాక్..జన్మత: పౌరసత్వ రద్దు ఆదేశాలకు బ్రేక్ వేసిన కోర్ట్

Trump administration ready to lay off 2 million employees
x

Trump: 20లక్షల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన ట్రంప్ సర్కార్ 

Highlights

Birthright Citizenship: అమెరికా అధ్యక్షుడిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ నకు మింగుడు పడని విషయం ఏంటంటే వలస వచ్చిన వారికి అమెరికా...

Birthright Citizenship: అమెరికా అధ్యక్షుడిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ నకు మింగుడు పడని విషయం ఏంటంటే వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే..ఆ చిన్నారులకు సహజంగానే వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికాల సియాటిల్ ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఆ రద్దు ఆదేశాలను న్యాయమూర్తి అడ్డుకున్నారు. ఆ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ పేర్కొన్నారు.

జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పారిస్ ఒప్పందంతో పాటు డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం వలస వచ్చిన వారి పిల్లలకు జన్మత:వచ్చే పౌరసత్వ రద్దు నిర్ణయాలు ఉన్నాయి.

దీంతో ట్రంప్ నిర్ణయంపై డెమెక్రాట్స్ నేత్రుత్వంలోని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఓరేగాన్ రాష్ట్రాలు కోర్టును సియాటిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం..పౌరసత్వం చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమంటూ వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాఫ్నర్ జన్మత పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల వేస్తూ తీర్పునిచ్చారు. ఇక పౌరసత్వ రద్దుకు సంబంధించి ఇప్పటికే 22 రాష్ట్రాలు, పలు పౌరసంఘాలు కోర్టుల్లో పలు దావాలు కూడా వేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories