Fighter Jet: ఆకాశంలోనే మంటలు.. కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం! కువైట్‌లో ఏం జరుగుతోంది?

Fighter Jet: ఆకాశంలోనే మంటలు.. కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం! కువైట్‌లో ఏం జరుగుతోంది?
x

Fighter Jet: ఆకాశంలోనే మంటలు.. కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం! కువైట్‌లో ఏం జరుగుతోంది?

Highlights

Fighter Jet: పశ్చిమాసియాలో వరుసగా మూడో రోజు ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఈ పరిణామాల మధ్య కువైట్ గగనతలంలో అమెరికాకు చెందిన ఒక శక్తివంతమైన యుద్ధ విమానం (US Warplane) కుప్పకూలడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.

Fighter Jet: పశ్చిమాసియాలో వరుసగా మూడో రోజు ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఈ పరిణామాల మధ్య కువైట్ గగనతలంలో అమెరికాకు చెందిన ఒక శక్తివంతమైన యుద్ధ విమానం (US Warplane) కుప్పకూలడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఇరాన్ మీడియా సంస్థలు విడుదల చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, కువైట్ గగనతలంలో ఎగురుతున్న సదరు ఫైటర్ జెట్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకొని భూమికి దూసుకొచ్చింది. ఆ విమానం అమెరికా నుంచి వచ్చిందా లేదా ఇజ్రాయెల్ పంపిందా అనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కూలిన విమానం F-15 లేదా F/A-18 రకానికి చెందినది కావొచ్చని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ రెండింటినీ అమెరికా రక్షణ దిగ్గజ సంస్థలే తయారు చేయడం గమనార్హం.

ఈ ప్రమాదంలో విమానంలోని ఇద్దరు పైలట్లు పారాచూట్ల సహాయంతో సురక్షితంగా బయటపడినట్లు సమాచారం అందుతోంది. ఘటనపై స్పందించిన కువైట్ రక్షణ శాఖ.. తమ దేశంలో పలు అమెరికా మిలిటరీ విమానాలు కూలినట్లు వెల్లడించింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి సిబ్బందిని రక్షించినట్లు పేర్కొంది. అయితే, అత్యంత అధునాతన సాంకేతికత కలిగిన ఈ విమానాలు కూలడానికి గల అసలు కారణాలను (సాంకేతిక లోపమా లేదా ప్రత్యర్థుల దాడా అనేది) కువైట్ ప్రభుత్వం వెల్లడించలేదు.

ఇప్పటికే సౌదీ అరామ్‌కోపై డ్రోన్ దాడులు, ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య పోరుతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇప్పుడు నేరుగా అమెరికా యుద్ధ విమానాలు కూలిపోతుండటం చూస్తుంటే, యుద్ధం మరో మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories