అమెరికా వీసాలపై భారత విద్యార్థులకు షాక్... ట్రంప్ నిర్ణయాలతో తగ్గిన F-1 వీసాలు!

అమెరికా వీసాలపై భారత విద్యార్థులకు షాక్: ట్రంప్ నిర్ణయాలతో తగ్గిన F-1 వీసాలు
x

అమెరికా వీసాలపై భారత విద్యార్థులకు షాక్: ట్రంప్ నిర్ణయాలతో తగ్గిన F-1 వీసాలు

Highlights

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలన్న కలలు కలవరానికి గురవుతున్నాయి. ఈసారి భారతీయ విద్యార్థులు అమెరికా చదువులపై వెనకడుగు వేస్తున్నారు. గతంలో కరోనా సమయంలోనూ ఇలా భారీగా వెనుకంజ వేయడం జరగలేదని తెలుస్తోంది.

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలన్న కలలు కలవరానికి గురవుతున్నాయి. ఈసారి భారతీయ విద్యార్థులు అమెరికా చదువులపై వెనకడుగు వేస్తున్నారు. గతంలో కరోనా సమయంలోనూ ఇలా భారీగా వెనుకంజ వేయడం జరగలేదని తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్ష పదవిలోకి వచ్చాక తీసుకుంటున్న నిర్ణయాలు, విధిస్తున్న ఆంక్షలు భారత విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

అమెరికా విదేశాంగ శాఖ తాజా గణాంకాల ప్రకారం, 2025 మార్చి నుండి మే మధ్య వరకు భారతీయులకు జారీ చేసిన ఎఫ్-1 విద్యా వీసాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 27 శాతం తగ్గింది. 2023లో ఇదే కాలంలో 14,987 వీసాలు జారీ కాగా, 2025లో కేవలం 9,906 వీసాలే ఇవ్వబడ్డాయి. 2024లో ఈ సంఖ్య 13,478గా ఉంది. ఇది 2022లో కొవిడ్ తర్వాత తిరిగి ప్రారంభమైన ప్రయాణాల సమయంలో జారీ అయిన 10,894 వీసాల కంటే కూడా తక్కువ కావడం గమనార్హం.

అమెరికాలో విద్యనభ్యసించాలన్న లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం మార్చి నుండి జూలై మధ్య వీసాల కోసం అప్లై చేస్తుంటారు. కానీ ఈసారి ట్రంప్ నిర్ణయాలు, వలస విధానాలపై ఉన్న అనిశ్చితి వాతావరణం వల్ల విద్యార్థుల్లో భయం నెలకొంది. పేరెంట్స్ కూడా తమ పిల్లలను అమెరికా పంపాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు.

వీసాలపై ఈ తగ్గుదల ఫలితంగా విద్యార్థుల కలలు తీరకుండా పోతున్నాయి. అమెరికాలో చదువు అనేది ఇప్పుడు ఓ సవాలుగా మారింది. ముందు ఏం జరుగుతుందో చూడాలంటే ట్రంప్ పాలనపై, ఆయన తీసుకునే భవిష్యత్ నిర్ణయాలపై బాగా కళ్లుపెట్టాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories