USA Second Hand Cars: అమెరికాలో సెకెండ్ హ్యాండ్ కార్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్?

USA Second Hand Cars
x

USA Second Hand Cars: అమెరికాలో సెకెండ్ హ్యాండ్ కార్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్?

Highlights

USA Second Hand Cars: మీరు ఎక్కడైనా కొత్త కారు కంటే సెకండ్ హ్యాండ్ కారే రేటు ఎక్కువ అనే విషయాన్ని విన్నారా? వినలేదు కదా. అవును మీరే కాదు ఎవరూ ఇప్పటి వరకు సెకెండ్ హ్యాండ్ కార్లు కొత్త కారు కంటే ఎక్కువ డబ్బును పెట్టి కొనరు.

USA Second Hand Cars: మీరు ఎక్కడైనా కొత్త కారు కంటే సెకండ్ హ్యాండ్ కారే రేటు ఎక్కువ అనే విషయాన్ని విన్నారా? వినలేదు కదా. అవును మీరే కాదు ఎవరూ ఇప్పటి వరకు సెకెండ్ హ్యాండ్ కార్లు కొత్త కారు కంటే ఎక్కువ డబ్బును పెట్టి కొనరు. కానీ అమెరికాలో ఇదే జరుగుతుంది. ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ సెకెండ్ కార్లను కొంటున్నారు. మరి దానికి కారణాలేంటో చూద్దాం.

ఎవరైనా సెకెండ్ హ్యాండ్ కార్ కొనడానికి వెళితే.. ఆ కారు రేటు ఎక్కువగా ఉంటే.. ఏం చేస్తారు? దీనికి బదులు ఈ డబ్బులకు కొత్త కారు వచ్చేస్తుంది... అని అక్కడ నుంచి వచ్చేస్తారు. కానీ అమెరికాలోని ప్రజలు అలా వెనిక్కి తిరిగి రావడం లేదు. ఎంత డబ్బైనా పర్వాలేదు. మాకు సెకెండ్ హ్యాండ్ కారే కావాలి అని అంటున్నారు.

అమెరికాలో ప్రస్తుతం సెకెండ్ హ్యాండ్ కార్ల హోల్ సేల్ వేలంలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే దీనికి కారణం ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఆయన తీసుకొచ్చిన ఆటో టారిఫ్స్ వల్లే వాహనాల ధరల్లో పెరుగుదల మొదలైందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీంతో మ్యాన్ హీమ్ ఉపయోగించిన వాహన విలువ సూచిక మే నుండి జూన్‌లో 1.6 శాతం పెరుగుదలను నమోదు చేసింది. వాస్తవానికి ఇది ఆగష్టు 2022 తర్వాత అతిపెద్ద పెరుగుదలగా నిపుణులు చెబుతున్నారు.

డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పన్నులతో కొత్త ఆటో అమ్మకాలు, సరఫరాలు నిజంగా కుదేలయ్యాయి. అయితే ప్రస్తుతం ఉపయోగించిన కార్ల మార్కెట్‌లోకి లీజుకు వచ్చిన వాహనాల సరఫరా తగ్గుతుంది. అందుకే సెకెండ్ హ్యాండ్ కార్ల ధరలు పెరుగుతున్నాయి. అయినా కూడా ప్రజలు ఇప్పుడు సెకెండ్ హ్యాండ్ కార్లను ఎగబడి కొంటున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత నుంచీ దేశంలో వచ్చిన మార్పులకు ప్రజలు నలిగిపోతున్నారు. ముఖ్యంగా ఆటో మొబైల్స్‌లో తీసుకొచ్చిన మార్పులు నిజంగా అందరినీ కలవరపెడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories