America News: ఇండియన్స్‌ స్టూడెంట్స్‌కు ట్రంప్‌ భారీ ఝలక్‌.. దేశం వీడాలని మెయిల్స్!

America News
x

America News: ఇండియన్స్‌ స్టూడెంట్స్‌కు ట్రంప్‌ భారీ ఝలక్‌.. దేశం వీడాలని మెయిల్స్!

Highlights

America News: ట్రంప్ ప్రభుత్వం పాలస్తీనా మద్దతుదారులను హమాస్ సపోర్టర్లగా చిత్రికరిస్తుందనే వాదన వినిపిస్తోంది. నిజానికి ఇలా చేయడం విద్యార్థుల హక్కులను తుంగలో తొక్కడమే అవుతుంది.

America News: అమెరికాలో చదువుకుంటున్న ఓ ఇండియన్‌ స్టూడెంట్‌ పాలస్తీనాకు సపోర్ట్‌గా వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టాడు.. కాసేపటికి అతనికి ఒక మెయిల్‌ వచ్చింది.. అమెరికా అధికారులు పంపిన మెయిల్ అది. అమెరికా నుంచి పెట్టె బేడా సర్ధుకోని వెళ్లిపోవాలన్నది ఆ మెయిల్ సారాంశం. మరో విద్యార్థికి అదే తరహా మెసేజీ వచ్చింది. సోషల్‌మీడియాలో హమాస్‌కు మద్దతుగా ఉన్న ఓ పోస్టుకు లైక్‌ కొట్టాడని అతను కూడా అమెరికాను వీడాలని మెసేజీలో రాసి ఉంది. అటు అమెరికాలోని వివిధ యూనివర్శిటీల్లో ఇటివల కాలంలో చాలా మంది విద్యార్థులు పాలస్తీనాకు మద్దతుగా రోడెక్కారు. ఇది కూడా ట్రంప్‌గారికి నచ్చలేదు.. వారిని కూడా అగ్రరాజ్యం నుంచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అసలు ట్రంప్‌కు ఒకే ఒక డైలాగ్‌ వచ్చిన్నట్టు అనిపిస్తోంది. అదే గెట్‌ అవుట్ ఆఫ్‌ అమెరికా..! ఒకరిని, ఇద్దరిని కాదు... వందలాది మందిని బయటకు పొమంటున్నారు. అమెరికా నుంచి వెళ్లిపోవాలంటూ ఇండియన్‌ స్టూడెంట్స్‌కు మెయిల్స్‌ పంపడం సంచలనం రేపుతోంది.

అమెరికాలో చదువుతున్న చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులు ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద చర్యల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలస్తీనా హక్కులను మద్దతు ఇచ్చిన విద్యార్థులపై అమెరికా విదేశాంగ శాఖ-DOS ఇమెయిల్స్ పంపించడం మొదలుపెట్టింది. విద్యార్థులు పాలస్తీనా మద్దతుగా పోస్ట్‌లు షేర్ చేయడమే కాకుండా, కేవలం లైక్ చేసినా వేటు తప్పదు. డోనాల్డ్ ట్రంప్ అండర్‌లో కొనసాగుతున్న క్యాచ్‌ అండ్‌ రివోక్‌ ప్రొగ్రామ్ కింద ఇప్పటికే 300కి పైగా అంతర్జాతీయ విద్యార్థులకు వీసాలు రద్దయ్యాయి.

ఓపెన్ డోర్స్‌ నివేదిక ప్రకారం.. అమెరికాలో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు వీసాలు కలిగి ఉన్నారు. వీరిలో 3లక్షల 31 వేల మంది భారతీయులు, 2లక్షల 77 వేల మంది చైనాకి చెందిన వారు ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వం పాలస్తీనా మద్దతుదారులను హమాస్ సపోర్టర్లగా చిత్రికరిస్తుందనే వాదన వినిపిస్తోంది. నిజానికి ఇలా చేయడం విద్యార్థుల హక్కులను తుంగలో తొక్కడమే అవుతుంది. హక్కుల కోసం నిరసనలు చేసిన విద్యార్థులను దేశద్రోహులుగా ముద్రించడం, వీసాలు రద్దు చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అనే విమర్శలు అన్నీ వైపుల నుంచి వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories