War Alert: పాకిస్థాన్‌ యుద్దానికి సిద్ధమవుతుందా? దాయాది బంకర్ల గురించి కీలక అప్‌డేట్

War Alert
x

Terror Attack: రైల్వే ఆస్తులు, కాశ్మీరీ పండిట్స్ లక్ష్యంగా టెర్రర్ ప్లాన్?

Highlights

War Alert: ఇక ముస్లిమ్ మిలిటెన్సీకి అండదండలు అందించే పాకిస్థాన్‌.. ఇప్పుడు యుద్ధ దిశగా అడుగులు వేస్తోందని సమాచారం.

War Alert: పాకిస్థాన్‌ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. భారత విక్రాంత్ సముద్రాన్ని చీల్చుకుంటూ వచ్చిన వెంటనే, దాని ప్రతిధ్వని పాకిస్థాన్‌ కొండల వరకు చేరింది. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ఆర్మీ తన బలగాలను పెంచుతోంది. తక్షణమే అదనపు సైనికులను నియమించి, వారికి బంకర్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

కొన్నిరోజులుగా సరిహద్దు రేఖ వెంబడి అనూహ్య కదలికలు జరుగుతున్నాయి. అంతే కాదు.. సియాల్‌కోట్ డివిజన్‌కూ అలెర్ట్ ప్రకటించింది పాకిస్థాన్‌. ఇక ముస్లిమ్ మిలిటెన్సీకి అండదండలు అందించే పాకిస్థాన్‌.. ఇప్పుడు యుద్ధ దిశగా అడుగులు వేస్తోందని సమాచారం. ఇటు పాకిస్థాన్‌.. మిస్సైల్‌ టెస్టులకు కూడా ఆదేశాలు జారీ చేయడం మరింత సంచలనం రేపుతోంది. కరాచీ తీరం నుంచి సర్ఫెస్‌ టు సర్ఫెస్‌ మిస్సైల్‌ టెస్ట్‌ను నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇలా ఓవైపు ఇండియా విక్రాంత్‌ను మోహరిస్తే.. అటు పాకిస్థాన్‌ మిస్సైల్‌ టెస్టులతో పాటు సైనికులకు కీలక ఆదేశాలు జారీ చేయడం యుద్ధ భయాలను అమాంతం పెంచిందనే చెప్పాలి. అయితే ఇదంతా యుద్ధం చేయడం కోసమే తీసుకున్న చర్యలగా ఇప్పటికైతే చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా ప్రత్యర్థిని భయపెట్టాలనే లక్ష్యంతోనూ ఇలా చేసే అవకాశాలు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories