Jammikunta Traffic Issue: జమ్మికుంట గాంధీ చౌరస్తాలో భారీ ట్రాఫిక్.. ప్రజల ఇబ్బందులు

Jammikunta Traffic Issue: జమ్మికుంట గాంధీ చౌరస్తాలో భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ సమస్య తీవ్రం. వాహనదారులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 1 April 2026 10:43 AM IST
Jammikunta Traffic Issue
X

Jammikunta Traffic Issue: జమ్మికుంట గాంధీ చౌరస్తాలో భారీ ట్రాఫిక్.. ప్రజల ఇబ్బందులు

Jammikunta Traffic Issue:కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంది. కొరపల్లి వైపు వెళ్లే రహదారి అతి సంకుచితంగా ఉండటంతో భారీ వాహనాల రాకపోకలు పెరిగి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు వచ్చే వాహనాలు, అటు నుంచి వచ్చే వాహనాలు ఒకదానికొకటి కనిపించని పరిస్థితి ఏర్పడి ప్రమాదాలకు దారి తీస్తోంది.

ఈ మార్గం కొండపాక, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాలకు ప్రధాన కనెక్టివిటీ రోడ్ కావడంతో రోజూ వేలాది వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే పరిస్థితి నెలకొంటోంది. సమీపంలో కూరగాయల మార్కెట్, చికెన్ సెంటర్లు ఉండటంతో ట్రాఫిక్ మరింత తీవ్రమవుతోంది.

గాంధీ చౌరస్తా వద్ద బ్రాండ్ షాపులు, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ఉండటం వల్ల ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. వాహనాలు ఢీకొన్న ఘటనలు ఇప్పటికే పలుమార్లు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం వేళ షాపింగ్‌కు వచ్చిన వారికి వాహనాలను పార్క్ చేయడం కూడా కష్టంగా మారింది.

ఈ నేపథ్యంలో భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించాలని లేదా ట్రాఫిక్ పోలీసులను నియమించాలని స్థానిక వ్యాపారులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story