కుప్పకూలిన భారీ క్రేన్లు

కాకినాడ సీ పోర్టులో రెండు భారీ క్రేన్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు.

Arun Chilukuri
Updated on: 29 Dec 2018 5:29 PM IST
cranes
X
cranes

కాకినాడ సీ పోర్టులో రెండు భారీ క్రేన్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. కె.ఎస్.పి.ఎల్‌లోని 6వ నెంబరు బెర్త్‌పై పాత క్రేన్ రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డీప్ వాటర్ పోర్టు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సర్పవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో మృతుల సంఖ్య ఇంకా ఉండవచ్చని తోటి కార్మికులు చెబుతున్నారు. ఇటీవల సంభవించిన తుపాను కారణంగా దెబ్బతిన్న క్రేన్‌ను మరమ్మతు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీ క్రేన్లు కుప్పకూలిపోవడంతో అక్కడి కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story