Doom Scroller Job: సోషల్ మీడియా వ్యసనపరులకు ఉద్యోగం.. ముంబయి సీఈవో సంచలన ప్రకటన

Doom Scroller Job: సోషల్ మీడియా వ్యసనపరులకు ఉద్యోగం.. ముంబయి సీఈవో సంచలన ప్రకటన
x

Doom Scroller Job: A job for social media addicts.. sensational announcement by Mumbai CEO

Highlights

ముంబయి Monk Entertainment CEO విరాజ్ శేథ్‌ సంచలన ప్రకటన, సోషల్ మీడియా ఎక్కువగా వాడేవారికి Doom Scroller ఉద్యోగం, రోజుకు 6 గంటలు Instagram, YouTube స్క్రోల్ చేస్తే ఫుల్ టైమ్ జాబ్ అవకాశం.

సోషల్ మీడియా ఎక్కువగా వాడేవారికి ఉద్యోగం ఇస్తామంటూ ముంబయి ఆధారిత డిజిటల్ మీడియా ఏజెన్సీ Monk Entertainment CEO & Co-founder విరాజ్‌ శేథ్‌ (Viraj Sheth) ఇచ్చిన ప్రకటన నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.

‘‘డూమ్ స్క్రోలర్స్ (Doom Scrollers) కావాలి. స్క్రీన్ స్క్రోల్ చేస్తూ తాజా విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. రోజుకు కనీసం ఆరు గంటలు Instagram, YouTube వాడుతూ ఉండాలి. అలాగే కంటెంట్ క్రియేటర్ కల్చర్‌ పట్ల ఆసక్తి ఉండాలి’’ అని ఆయన తన LinkedIn, Instagram Stories ద్వారా జాబ్ రోల్ వివరాలు షేర్ చేశారు.

అదేవిధంగా అభ్యర్థులకు హిందీ, ఇంగ్లీష్‌లో నైపుణ్యం, అలాగే Excel వాడకం తెలిసి ఉండాలని షరతు పెట్టారు. ఇది ఫుల్ టైం జాబ్ అని స్పష్టం చేశారు. అయితే జీతం వివరాలు మాత్రం వెల్లడించలేదు.

సోషల్ మీడియాలో రియాక్షన్స్

ఈ ఉద్యోగ ప్రకటనపై నెట్టింట్లో వేర్వేరు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

  1. ‘‘నేను 19 గంటలు ఆన్‌లైన్‌లో గడుపుతాను.. నేను ఓవర్‌ క్వాలిఫైడా..?’’ అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు.
  2. ‘‘మునుపు సోషల్ మీడియా ఎక్కువ వాడితే ప్రమాదమని అనేవారు.. ఇప్పుడు అది ఫుల్ టైం జాబ్ అయిపోయింది’’ అని మరొకరు స్పందించారు.
  3. ‘‘ఎక్కువ స్క్రీన్ టైమ్.. ఇప్పుడు జీతంగా మారబోతోంది’’ అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.

Doom Scroller అంటే ఏమిటి?

ఎక్కువ సమయం ఫోన్ స్క్రీన్ స్క్రోల్ చేస్తూ, ముఖ్యంగా ప్రతికూల లేదా ఆందోళన కలిగించే కథనాలు చదివేవారిని ‘డూమ్ స్క్రోలర్’ అంటారు. అయితే ఇప్పుడు ఈ పదానికి విస్తృతమైన అర్థం ఏర్పడింది. ఎక్కువ సమయం స్క్రీన్ చూసేవారిని కూడా Doom Scroller అని పిలుస్తున్నారు.

Monk Entertainment నేపథ్యం

Monk Entertainment సంస్థను Ranveer Allahbadia మరియు Viraj Sheth కలిసి స్థాపించారు. ఇటీవల రణవీర్ ఒక హాస్య కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories