బంగారం ధరలపై భారీ కుదింపు అంచనా – త్వరగా కొనాలనుకునేవారికి ముఖ్యవార్త!

బంగారం ధరలపై భారీ కుదింపు అంచనా – త్వరగా కొనాలనుకునేవారికి ముఖ్యవార్త!
x

బంగారం ధరలపై భారీ కుదింపు అంచనా – త్వరగా కొనాలనుకునేవారికి ముఖ్యవార్త!

Highlights

బంగారం ధరలు తులానికి రూ.25,000 వరకు తగ్గే అవకాశం ఉందని Citi Bank తాజా నివేదిక చెబుతోంది. 2026 నాటికి ధరలు 25% వరకూ పడిపోవచ్చని అంచనా. బంగారం కొనుగోలు ప్లాన్ ఉన్నవారు ఓపిక పట్టడం మంచిదన్న సూచన.

బంగారం కొనుగోలు (Gold Investment) చేయాలనుకుంటున్న మహిళలు, వినియోగదారులకు ఇది నిజంగా గుడ్ న్యూస్‌. Citi Bank తాజా నివేదిక ప్రకారం, రాబోయే ఐదు నుండి ఆరు నెలల్లో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. బులియన్ మార్కెట్‌ (Bullion Market) నిపుణుల అంచనా మేరకు, తులం బంగారంపై రూ. 25,000 వరకూ తగ్గుదల ఉండే అవకాశముంది.

బంగారం ధరలు ఎందుకు తగ్గబోతున్నాయ్‌?

ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర $3,400 వద్ద ఉన్నప్పటికీ, 2026 నాటికి $2,400–$2,500 వరకు పడిపోవచ్చని Citi Bank అంచనా వేస్తోంది. ఇది కనీసం 25 శాతం తగ్గుదలకు సంకేతం. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి:

  • పెట్టుబడి డిమాండ్ తగ్గడం
  • ప్రపంచ ఆర్థిక వృద్ధి పుంజుకోవడం
  • ట్రంప్ పాలనలోని టారిఫ్ సర్దుబాట్లు
  • ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు
  • సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్ల తగ్గింపు

గడిచిన సంవత్సరంలో బంగారం ఎలా పయనించింది?

2024లో బంగారం ధరలు దాదాపు 45 శాతం పెరిగాయి. 2025 ప్రారంభం నుంచి జూలై వరకు ఇది 30 శాతం పెరిగి, ఏప్రిల్‌లో గరిష్ట స్థాయిని తాకింది. అయితే, నిపుణుల అభిప్రాయం మేరకు ఇప్పుడు కొనుగోలు చేయడం కన్నా కొద్దిరోజులు ఆగితే వడ్డింపు ధరలకు బంగారం లభించవచ్చు.

మహిళలకు సలహా

పెళ్లిళ్లు, పండుగల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారు కాస్త ఓపిక పట్టడం ఉత్తమం. Citi Bank అంచనాలు నిజమైతే, వచ్చే 6 నెలల్లో బంగారం ధరలు తుళ్లానికి రూ. 25,000 వరకూ తగ్గే అవకాశం ఉంది. ఈ సమయంలో కొనుగోలు చేయడం వల్ల పెద్ద మొత్తంలో ఆదా సాధ్యమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories