వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు: స్టెరిలైజేషన్ చేసి విడిచిపెట్టాలి, రోడ్లపై ఆహారం పెట్టకూడదు


Supreme Court’s Key Verdict on Stray Dogs: Must Be Sterilized and Released, Feeding on Roads Prohibited
Supreme Court on Stray Dogs వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, స్టెరిలైజేషన్ తర్వాత విడిచిపెట్టాలి, రోడ్లపై ఆహారం పెట్టకూడదు, ప్రత్యేక feeding spaces తప్పనిసరి అని ఆదేశాలు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన Stray Dogs Issue పై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో వీధి కుక్కలను తొలగించాలని వచ్చిన ఆదేశాలను సవరించి, వాటిని స్టెరిలైజేషన్ (sterilization), వ్యాక్సినేషన్ (vaccination) చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని స్పష్టం చేసింది. అయితే, రేబీస్ సోకిన కుక్కలు లేదా అగ్రెసివ్‌గా ప్రవర్తించే కుక్కలను మాత్రం తిరిగి వదలరాదని న్యాయస్థానం పేర్కొంది.
కుక్కలకు రోడ్లపై ఆహారం వద్దు
సుప్రీంకోర్టు తాజా తీర్పులో వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టకూడదని స్పష్టం చేసింది. బదులుగా, ప్రత్యేక "Feeding Spaces" ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది. ఆ ప్రదేశాల్లోనే ఆహారం పెట్టాలని, అక్కడ నోటిస్ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
జంతు ప్రేమికులకు ఉపశమనం
మూగజీవులను శాశ్వతంగా షెల్టర్లలో పెట్టడం అమానవీయం అని జంతు హితసంస్థలు (NGOs) మరియు జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును వారు విజయంగా భావిస్తున్నారు. అయితే, ఫీడింగ్ రూల్స్‌ను ఉల్లంఘించే వ్యక్తులు లేదా సంస్థలు రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
ప్రజల కోసం హెల్ప్‌లైన్
వీధి కుక్కల వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రజలు ఫిర్యాదు చేయగలిగేలా MCD Helpline Number ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, జంతు ప్రేమికులు MCD వద్ద కుక్కలను దత్తత తీసుకునేందుకు అప్లికేషన్ వేసుకోవచ్చని తెలిపింది.
జాతీయ స్థాయి పాలసీపై దృష్టి
వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు జాతీయ స్థాయి పాలసీ రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.
నేపథ్యం
జులై 28న ఒక మీడియా రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు Stray Dogs suo motu caseను నమోదు చేసింది. ఆగస్ట్ 11న దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లోని అన్ని వీధి కుక్కలను వెంటనే పట్టుకుని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. కానీ ఈ ఆదేశాలు దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. జంతు సంక్షేమ సంస్థలు కుక్కల సమస్యకు sterilization, vaccinationలే మానవతా దృక్పథంతో కూడిన పరిష్కారం అని వాదించాయి.
తీర్పుపై ప్రతిస్పందనలు
జంతు హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు, వెటర్నరీ నిపుణులు అందరూ ఈ తీర్పును స్వాగతించారు. ముఖ్యంగా “ఆధికారుల నిర్లక్ష్యం వల్లే సమస్య పెరిగింది” అని కోర్టు చేసిన వ్యాఖ్యలను సంతోషంగా భావిస్తున్నారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire