Health: బాదం పప్పు మాత్రమే కాదు నూనెతో కూడా మ్యాజిక్‌.. లాభాలు తెలిస్తే

Health: బాదం పప్పు మాత్రమే కాదు నూనెతో కూడా మ్యాజిక్‌.. లాభాలు తెలిస్తే
x

Health: బాదం పప్పు మాత్రమే కాదు నూనెతో కూడా మ్యాజిక్‌.. లాభాలు తెలిస్తే

Highlights

Almond Oil Benefits: బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. అందుకే కచ్చితంగా బాదంను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్‌ ఏ, ఈ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Almond Oil Benefits: బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. అందుకే కచ్చితంగా బాదంను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్‌ ఏ, ఈ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే బాదం పప్పు మాత్రమే కాదు, బాదం నూనె కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని మీకు తెలుసా.? ఇంతకీ బాదం నూనెతో కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* బాదం నూనెను తలకి అప్లై చేయడం లేదా స్వల్ప పరిమాణంలో తీసుకోవడం వల్ల జుట్టు మృదువుగా, ఒత్తుగా పెరుగుతుంది. ఇందులో ఉండే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. తలలో రక్త ప్రసరణ మెరుగుపడి, శిరోజాలకు అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో జుట్టు రాలడం తగ్గి, బలంగా మారుతుంది. ఈ నూనెలో క్యాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారి, వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆస్టియోపోరోసిస్‌ను నివారించవచ్చు.

* బాదం నూనెలో సహజసిద్ధమైన తేమను అందించే గుణాలు ఉన్నాయి. దీన్ని చర్మానికి రాస్తే పొడి చర్మం మృదువుగా మారుతుంది. కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ వాపులు తగ్గి, సహజ నిగారింపు పెరుగుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెదడుకు మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచి, అల్జీమర్స్ లాంటి నాడీ సంబంధిత సమస్యలను అరికట్టవచ్చు.

* బాదం నూనెను కొంత మొత్తంలో తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు దీనిని రోజూ తీసుకుంటే రక్తంలో షుగర్ స్థాయులు నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది.

* బాదం నూనెలో విటమిన్ E, పాలీఫెనాల్స్ ఉండటం వల్ల ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. బాదం నూనెను చర్మానికి అప్లై చేస్తే గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories