Anti Ageing Fruit: ఈ పండు తింటే ఏ పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. చంద్రబింబంలాంటి అందం మీదే..

Anti Ageing Fruit
x

Anti Ageing Fruit: ఈ పండు తింటే ఏ పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. చంద్రబింబంలాంటి అందం మీదే..

Highlights

Anti Ageing Fruits For Radiant Skin: అందంగా కనిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. పార్లర్లకు వెళ్లడంతో పాటు ఎక్కువ ఖర్చు పెట్టి క్రీములు కూడా ఉపయోగిస్తారు. ఇవి కాకుండా ఇంటి చిట్కాలు ఉండనే ఉన్నాయి.

Anti Ageing Fruits For Radiant Skin: మచ్చలేని మెరిసే అందానికి క్రీములు కాదు.. కొన్ని రకాల ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవాలి. వీటివల్ల సహజసిద్ధంగా మీ అందం మెరిసిపోతుంది. ఎందుకంటే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్స్ ఉంటాయి. ముఖంపై ఉండే గీతలను తొలగించి కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడతాయి. దీంతో మీ ముఖానికి పునరుజ్జీవం కూడా అందుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెరిసే అందం.. మృదువైన చర్మం పొందాలంటే ఈ పండు తినండి.

స్ట్రాబెరీ ..

స్ట్రాబెరీ ఇందులో విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంతేకాకుండా ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్ (AHA)కూడా ఉంటుంది. ఇది ప్రధానంగా కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే పండు. ఇది మీ చర్మాన్ని సహజంగా ఎక్స్‌ఫోలియేట్‌ కూడా చేసేస్తుంది. ఈ పండును రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంద.

ఆరంజ్..

మచ్చలేని అందం మీ సొంతం అవ్వాలంటే ఆరంజ్ కూడా తినాల్సిందే. ఇందులో కూడా విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అంతేకాదు మీ చర్మ రంగును కూడా మెరుగు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇందులోని సీట్రిక్ యాసిడ్ సహజసిద్ధంగా మీ ముఖాన్ని ఎక్స్‌ఫోలియట్ చేస్తుంది.

కీవీ..

కీవీ పండులో కూడా ఎక్కువ మోతాదులో విటమిన్ సి ఉంటుంది. ఇది డ్యామేజ్ అయిన స్కిన్ కూడా రిపేర్ చేసే గుణాలు కలిగి ఉంటుంది. అంతేకాదు కీవీ పండు కూడా కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఇ ఉండటం వల్ల ఇది మీ చర్మానికి మంచి హైడ్రేషన్ అందిస్తుంది.

బ్లూబెర్రీ ..

బ్లూబెర్రీ పండ్లలో కూడా విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇందులో విటమిన్ సి విటమిన్ ఇ, ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడి చర్మంపై త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా కాపాడతాయి.

అవకాడో..

అవకాడో కూడా మీ డైట్ లో ఉండాల్సిందే. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా.. ఇందులో విటమిన్ ఇ, విటమిన్ సి, బయోటిన్‌తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఈ ఎండాకాలం మీ స్కిన్ కి మంచి హైడ్రేషన్ అందిస్తుంది. మృదువైన చర్మం పొందాలంటే ఇలాంటి గుణాలు కలిగి ఉన్న అవకాడో తినండి ముఖంపై ఉండే మచ్చలు, దురదలు కూడా తొలగించేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories