Ice Cream: వేడిగా ఉందని ఐస్‌క్రీం అతిగా తింటున్నారా.. ఒక్కసారి దుష్ప్రభావాలపై లుక్కేయండి..!

Are You Eating Too Much Ice Cream Because It Is Hot Know The Side Effects
x

Ice Cream: వేడిగా ఉందని ఐస్‌క్రీం అతిగా తింటున్నారా.. ఒక్కసారి దుష్ప్రభావాలపై లుక్కేయండి..!

Highlights

Ice Cream Side Effects: ఎండాకాలం వాతావరణం వేడిగా ఉంటుంది.. అందుకే చాలామంది చల్లటి పదార్థాలని తినడానికి మొగ్గుచూపుతారు.

Ice Cream Side Effects: ఎండాకాలం వాతావరణం వేడిగా ఉంటుంది. అందుకే చాలామంది చల్లటి పదార్థాలని తినడానికి మొగ్గుచూపుతారు. అందులో ఎక్కువ మంది ఐస్‌క్రీం మాత్రమే తింటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఐస్ క్రీం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. రోజుకు 3 నుంచి 4 ఐస్ క్రీములు తింటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. అనేక రకాల వ్యాధులు చుట్టుముట్టవచ్చు. ఐస్ క్రీం ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టమేమిటో ఈరోజు తెలుసుకుందాం.

1. ప్రతిరోజూ ఐస్ క్రీం ఎక్కువగా తింటే అది ఊబకాయాన్ని పెంచుతుంది. ఇందులో షుగర్, క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

2. ఐస్ క్రీం ఎక్కువగా తినడం వల్ల మధుమేహం సంభవిస్తుంది. వాస్తవానికి ఐస్ క్రీం లో షుగర్ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్ ను పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఐస్‌క్రీమ్‌ను పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.

3. ఐస్‌క్రీమ్‌లో ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణంగా నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. ఇది కాకుండా కడుపు ఉబ్బరం, అజీర్ణం సమస్య మొదలవుతుంది.

4. ఐస్‌క్రీమ్‌లో సంతృప్త కొవ్వు, చక్కెర ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయి. మతిమరుపు లేదా జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తుంది.

5. ఐస్‌క్రీమ్‌లో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి రోజుకు మూడు నుంచి నాలుగు కప్పుల ఐస్‌క్రీమ్ తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోండి.

6. ఐస్ క్రీం తినడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఐస్ క్రీం తిన్నాక గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు ఎదురవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories