Health Tips: ఇయర్‌ఫోన్స్‌ అతిగా వాడుతున్నారా? జర జాగ్రత్త!

Health Tips: ఇయర్‌ఫోన్స్‌ అతిగా వాడుతున్నారా? జర జాగ్రత్త!
x

Health Tips: ఇయర్‌ఫోన్స్‌ అతిగా వాడుతున్నారా? జర జాగ్రత్త!

Highlights

Health Tips: రోజంతా ఇయర్‌ఫోన్స్ వాడితే వినికిడి శక్తికి ముప్పు.. చెవి నొప్పి, హియరింగ్ లాస్ ప్రమాదం అంటున్న నిపుణులు!

Health Tips:ఈ ఆధునిక సాంకేతిక యుగంలో గాడ్జెట్స్ వినియోగం మునుపెన్నడూ లేనంత స్థాయికి చేరుకుంది. ఈ రోజుల్లో పని కోసమో లేదంటే వినోదం కోసమో చాలామంది రోజంతా ఇయర్‌ఫోన్స్‌ లేదా హెడ్‌ఫోన్స్‌ వాడుతుంటారు. ముఖ్యంగా ఎక్కువ సౌండ్‌ (వాల్యూమ్) పెట్టి వినడం ఒక అలవాటుగా మారిపోయింది. అయితే ఈ అలవాటు మిమ్మల్ని శాశ్వతంగా చెవిటి వాళ్లను చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సాధారణంగా 50 ఏళ్లు దాటిన తర్వాత వినికిడి శక్తి తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ఇయర్‌ఫోన్స్‌ వాడకం వల్ల 40 ఏళ్లకే చాలామందిలో వినికిడి సమస్యలు మొదలవుతున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సౌండ్ ఎంత ఎక్కువగా ఉంటే, వినికిడి సామర్థ్యం అంత వేగంగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వినికిడి శక్తి తగ్గుతుందని చెప్పే లక్షణాలు ఇవే..

* ఎదుటివారు మాట్లాడుతున్న మాటలు సరిగ్గా అర్థం కాకపోవడం.

* జనం ఎక్కువగా ఉన్న చోట లేదా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మాటలు వినబడకపోవడం.

* ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తి మాటలు స్పష్టంగా లేకపోవడం లేదా ముక్కలు ముక్కలుగా వినిపించడం.

* చెవుల్లో గంటలు మోగుతున్నట్లు లేదా ఈల వేస్తున్నట్లు (Tinnitus) అనిపించడం.

చెవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి "60-60" ఫార్ములా..

* మీ మొబైల్ వాల్యూమ్‌లో 60% కంటే తక్కువ సౌండ్‌తోనే వినాలి.

* ప్రతి గంటకు ఒకసారి కొద్దిసేపు చెవులకు విశ్రాంతి (బ్రేక్) ఇవ్వాలి.

మీరు పైన పేర్కొన్న సమస్యలతో బాధపడుతుంటే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినికిడి సమస్యను నిర్లక్ష్యం చేయవద్దని, హెడ్‌ఫోన్స్‌ వాడకాన్ని తగ్గించి, వీలైనంత వరకు స్పీకర్‌ మోడ్‌లో లేదా తక్కువ వాల్యూమ్‌లో వినడానికి ప్రయత్నించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories