Magic Juice: ఈ జ్యూస్ రోజూ పరగడుపున తాగితే వందేళ్లు జీవించవచ్చా

Ash Gourd Juice Benefits Sadhguru Tips
x

Magic Juice: ఈ జ్యూస్ రోజూ పరగడుపున తాగితే వందేళ్లు జీవించవచ్చా

Highlights

Magic Juice: ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో అధిక శాతం మందికి చెడు ఆహారపు అలవాట్లు, అనిశ్ర‌మిత జీవన విధానం సమస్యలు పెంచేస్తున్నాయి.

Magic Juice: ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో అధిక శాతం మందికి చెడు ఆహారపు అలవాట్లు, అనిశ్ర‌మిత జీవన విధానం సమస్యలు పెంచేస్తున్నాయి. దాంతో హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటిస్, ఒబేసిటీ, అర్థరైట్‌స్‌ వంటి ఎన్నో రకాల వ్యాధులు బారిన పడుతున్నారు. ఇండియాలో నూరేళ్లు బ్రతకే వారి సంఖ్య కూడా తగ్గిపోతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో నాటి ఆచారాలను, ప్రకృతిలో లభించే ఆరోగ్యదాయకమైన పదార్థాలను మళ్లీ జీవనవిధానంలో భాగం చేసుకోవాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ సూచిస్తున్నారు. ఆయన చెప్పిన ప్రకారం రోజూ ఉదయం పరగడుపున బూడిద గుమ్మడి జ్యూస్ తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని అంటున్నారు.

బూడిద గుమ్మడిలో ఐరన్, కాల్షియం, కాపర్, ఫైబర్, జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడంతో పాటు, ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. ముఖ్యంగా ఈ జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా తగ్గించుకోవచ్చు.

బూడిద గుమ్మడిలో ఉండే విటమిన్ C, విటమిన్ B3, ఫైబర్ కారణంగా కడుపులో గుడ్ బ్యాక్టీరియా పెరిగి, గట్ హెల్త్ మెరుగవుతుంది. దీనివల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

ఈ పండు జ్యూస్‌లో విటమిన్ C, విటమిన్ A అధికంగా ఉండటంతో ఇమ్యూనిటీ శక్తి గణనీయంగా పెరుగుతుంది. దాంతో తరచుగా వచ్చే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్‌లాంటి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పినట్టు, బూడిద గుమ్మడి జ్యూస్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ కీలకంగా పనిచేస్తుంది. రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. స్ట్రెస్, టెన్షన్ తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ప్రతిరోజూ పరగడుపున బూడిద గుమ్మడి జ్యూస్ తాగడం ద్వారా శరీరానికి కావల్సిన పోషకాలు, శక్తి అందుతాయి. ఇమ్యూనిటీ పెరగడంతో పాటు, జీర్ణవ్యవస్థ బాగుంటుంది. దీన్ని జీవనశైలిలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యంగా, ఆనందంగా, దీర్ఘాయుష్మంతులుగా జీవించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories