Beer: బీర్ తాగుతున్నారా? జాగ్రత్త..! మీ ఆరోగ్యానికి వచ్చే సీరియస్ సమస్యలు ఇవే

Beer: బీర్ తాగుతున్నారా? జాగ్రత్త..! మీ ఆరోగ్యానికి వచ్చే సీరియస్ సమస్యలు ఇవే
x
Highlights

వీకెండ్ వచ్చిందంటే చాలామంది ఫ్రెండ్స్‌తో కలిసి బీర్ తాగడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. సోషల్ డ్రింకింగ్‌ పేరుతో యూత్‌లో బీర్‌కు డిమాండ్ ఎక్కువ. కానీ డాక్టర్లు, న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్న దాని ప్రకారం రెగ్యులర్‌గా బీర్ తాగడం వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి.

వీకెండ్ వచ్చిందంటే చాలామంది ఫ్రెండ్స్‌తో కలిసి బీర్ తాగడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. సోషల్ డ్రింకింగ్‌ పేరుతో యూత్‌లో బీర్‌కు డిమాండ్ ఎక్కువ. కానీ డాక్టర్లు, న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్న దాని ప్రకారం రెగ్యులర్‌గా బీర్ తాగడం వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాసేపు రిలాక్స్ కోసం తాగే ఈ డ్రింక్ శరీరానికి మెల్లగా హానికరంగా మారుతుంది.

లివర్‌కు డేంజర్

బీర్‌లోని ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా ఫ్యాటీ లివర్, సిర్రోసిస్, ఆల్కహాలిక్ హెపటైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి, కళ్లు తిరగడం, అలసట తప్పవు. కడుపులో ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి.

పొట్ట పెరగడం

బీర్‌లో ఉన్న అధిక క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు బెల్లీ ఫ్యాట్‌గా మారుతాయి. రెగ్యులర్‌గా తాగే వారికి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల బరువు పెరగడమే కాక అనారోగ్య సమస్యలు వస్తాయి.

హార్మోన్ల అసమతుల్యత

అధికంగా బీర్ తాగితే హార్మోన్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగి పీరియడ్స్‌లో ఇబ్బందులు, మూడ్ స్వింగ్స్ వస్తాయి. 35 ఏళ్లు దాటిన తర్వాత బోన్ డెన్సిటీ కూడా తగ్గే అవకాశం ఉంది.

పురుషుల ఆరోగ్యంపై ప్రభావం

బీర్ తాగడం వల్ల మగవాళ్లలో టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది, ఈస్ట్రోజన్ పెరుగుతుంది. దీని వలన ఎనర్జీ, పనితీరు తగ్గి, సెక్సువల్ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

మెంటల్ హెల్త్‌కు ముప్పు

అధికంగా బీర్ తాగడం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం ఉంటుంది. మెమరీ లాస్, కాగ్నిటివ్ డిక్లైన్, విటమిన్ B1 డెఫిషియన్సీ వస్తాయి. అలాగే డిప్రెషన్, యాంగ్జైటీ పెరుగుతాయి. బీపీ, హార్ట్ డిసీజెస్, స్ట్రోక్, క్యాన్సర్ వంటి రిస్కులు కూడా పెరుగుతాయి.

మానేస్తే లాభమే

ఆల్కహాల్ మానేస్తే ఆరు నెలల్లోనే లివర్ మళ్లీ హెల్తీ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. నిద్ర సరిగా పడుతుంది. ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. అయితే డ్రింక్ చేసే వాళ్లు ఒక్కసారిగా మానేయకుండా, దశలవారీగా క్రమపద్ధతిలో మానేయాలి. అవసరమైతే రిహాబిలిటేషన్ సెంటర్లు, డాక్టర్ల సహాయం తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories