
Health Tips: ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగుతున్నారా? అయితే మీకు ఈ హెల్త్ బెనిఫిట్స్ గ్యారెంటీ!
మెటాబాలిజం పెంపు నుంచి ఫ్యాట్ బర్నింగ్ వరకు.. ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగితే శరీరానికి కలిగే అద్భుత లాభాలు ఇవే!
ఈ రోజుల్లో చాలామందికి ఉదయం నిద్రలేవగానే చాలా వ్యాపకాలు ఉండటం సర్వసాధారణం అయిపోయింది. కొందరికీ నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూడటం అలవాటు అయితే, మరికొందరికీ ఉదయాన్నే వేడివేడి కాఫీ తాగడం అలవాటు. అయితే పాలు, చక్కెర కలిపిన కాఫీ కంటే.. ఏమీ కలపని 'బ్లాక్ కాఫీ' తాగడం వల్ల శరీరానికి బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బ్లాక్ కాఫీలో అస్సలు కేలరీలు ఉండవు (ఎందుకంటే ఇందులో పాలు, పంచదార కలపం). ఇది శరీరంలోని మెటబాలిజం (జీవక్రియ)ను వేగవంతం చేస్తుంది, దీనివల్ల ఒంట్లో ఉన్న అనవసరమైన కొవ్వు కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాఫీ తాగగానే మన మెదడులో 'డోపమైన్', 'సెరోటోనిన్' వంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల మూడ్ వెంటనే మారిపోయి, మనసు ప్రశాంతంగా, ఉత్సాహంగా మారుతుంది. దీంతో ఏకాగ్రత కూడా పెరుగుతుందంటున్నారు.
మీరు బాగా అలసిపోయినట్లు ఉన్నప్పుడు లేదా బద్ధకంగా అనిపించినప్పుడు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగి చూడండి. ఇందులో ఉండే కెఫిన్ మీకు వెంటనే శక్తిని ఇచ్చి, అలసటను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ మితంగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం దాదాపు 7% వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. మనం తినే ఆహారంలోని వ్యర్థాలను శుద్ధి చేసే కాలేయం ఆరోగ్యానికి బ్లాక్ కాఫీ చాలా మంచిదని అంటున్నారు. ఇది కాలేయంలో అనవసరమైన కొవ్వు చేరకుండా చూస్తుందని, అలాగే కాలేయానికి సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుతుందని చెబుతున్నారు. అయితే బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, అతిగా తాగకూడదని సూచిస్తున్నారు. రోజుకు 2 నుంచి 3 కప్పులు తాగితే సరిపోతుందని, రాత్రి పడుకునే ముందు తాగకూడదని చెప్పారు.
- Health benefits of black coffee
- Black coffee for weight loss
- Black coffee and liver health
- Does black coffee reduce diabetes risk?
- Black coffee vs milk coffee benefits
- Best time to drink black coffee
- Black Coffee
- Weight Loss Tips
- Healthy Living
- Caffeine Benefits
- Liver Health
- Diabetes Prevention
- Mental Well-being

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




