Heart Patients: గుండెపోటు వచ్చిన వారు డ్రై ఫ్రూట్స్‌ తినకూడదా?

which dry fruits are not good for heart attack patients
x

Heart Patients: గుండెపోటు వచ్చిన వారు డ్రై ఫ్రూట్స్‌ తినకూడదా?

Highlights

గుండెపోటు వచ్చిన వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తీసుకునే ఆహారం మొదలు, జీవన విధానం వరకు అన్నింటిలో...

గుండెపోటు వచ్చిన వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తీసుకునే ఆహారం మొదలు, జీవన విధానం వరకు అన్నింటిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వారికి తెలిసో తెలియకో తీసుకోకూడని కొన్ని రకాల ఫుడ్స్‌ను తీసుకుంటూ ఆరోగ్యాన్ని రిస్కులో పెడుతుంటారు. అలాంటి వాటిలో డ్రై ప్రూట్స్‌ ఒకటి. సాధారణంగా అయితే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచి ఆహారం. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ గుండె సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌కు దూరంగా ఉండడమే మంచిదని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు అధిక కేలరీలు, కొవ్వు లేదా ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉండే డ్రై ఫ్రూట్స్‌కు దూరంగా ఉండాలి. వీటిలో జీడిపప్పు, హాజెల్ నట్స్, మకాడమియా, పైన్ నట్స్‌, క్యాండీడ్ పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అధిక కేలరీలున్న డ్రై ఫ్రూట్స్ బరువు పెరగడానికి దారితీస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే అధిక కేలరీల డ్రై ఫ్రూట్స్ అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతాయి. క్యాండీడ్ పండ్లలో చక్కెర లేయర్‌ ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

మరి ఏ డ్రై ఫ్రూట్స్ మంచివి?

కొన్ని రకాల డ్రైఫ్రూట్స్‌ గుండె జబ్బులతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైంది బాదం. ఇందులో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎండు ద్రాక్ష కూడా గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉపయోగపడుతుంది.

ఇక గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఉప్పును తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. పెద్దలు రోజుకు 2,300 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువ తినకూడదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories