Dehydration: ఈ వేసవిలో మిమ్మల్ని డిహైడ్రేషన్‌కు గురి కాకుండా కాపాడే 5 ఆహారాలు..

Dehydration
x

Dehydration: ఈ వేసవిలో మిమ్మల్ని డిహైడ్రేషన్‌కు గురి కాకుండా కాపాడే 5 ఆహారాలు..

Highlights

Hydration Foods: మండే ఎండాకాలం వచ్చింది ఏప్రిల్ నెల కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.

Hydration Foods: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తగ్గట్టుగా ఆహారం డైట్ లో చేర్చుకోవాలి. ప్రధానంగా నీటి శాతం అధికంగా ఉండే ఆహారాలు ఎండాకాలం తీసుకోవాలి. దీని వల్ల డిహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారు. డీహైడ్రేషన్‌ బారిన పడ్డప్పుడు తరచుగా తల తిరుగుతుంది, వాంతులు అవుతాయి. అలసట ఎక్కువగా ఉంటుంది. అయితే మీ రెగ్యులర్ డైట్ లో కొన్ని ఐదు ఆహారాలు చేర్చుకోవడం వల్ల డిహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారు

పుచ్చకాయ…

మనందరికీ తెలిసిందే పుచ్చకాయలు 95 శాతానికి పైగా నీరు ఉంటుంది. దీన్ని ఎండాకాలం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి. నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి డిహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. మార్కెట్లో ఎండాకాలం విరివిగా విక్రయిస్తారు. క్యాలరీలు కూడా తక్కువ మోతాదులో ఉంటాయి.

టమోటాలు..

టమాటోలు డైట్లో చేర్చుకోవడం వల్ల కూడా డిహైడ్రేషన్ గురికాకుండా ఉంటారు. ఎందుకంటే ఇందులో కూడా 90% కి పైగా నీరు ఉంటుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.

పాలకూర..

పాలకూరలో కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది కడుపు సమస్యలను చెక్‌ పెడుతుంది. వారంలో కనీసం రెండుసార్లు తినాలి. ఇందులో ఇనుము, విటమిన్ కే, ఫోలెట్‌ ఉంటుంది. పాలకూరను ఎండాకాలం చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.

దోసకాయ..

కీరదోసకాయ ముక్కల్లో నీటి శాతం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది శరీరానికి హైడ్రేషన్ అందిస్తుంది. డిహైడ్రేషన్ గురికాకుండా ఉండాలంటే కీరదోస ముక్కలు ప్రతిరోజు మీ డైట్ లో ఉండాల్సిందే. వీటిని పెరుగులో వేసుకొని సలాడ్ లేదా నేరుగా కూడా తీసుకోవచ్చు. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

గుమ్మడికాయ..

గుమ్మడికాయ చాలామంది తీసుకోరు. అయితే ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. గుమ్మడికాయ ముక్కలతో సాంబార్ చేసుకుని తీసుకుంటారు. ఇందులో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. క్రమం తప్పకుండా గుమ్మడికాయను ఎండాకాలం తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ గురి కాకుండా ఉంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories