Bhogi Wishes 2026: భోగి పండుగ శుభాకాంక్షలు – మీ వారికీ ఇలా చెప్పండి

Bhogi Wishes 2026
x

Bhogi Wishes 2026

Highlights

Bhogi Wishes 2026: మూడు రోజుల సంక్రాంతి పండుగల్లో తొలి రోజు భోగి (Bhogi 2026). ధనుర్మాసానికి ముగింపు పలికే ఈ పర్వదినం, కొత్త జీవనానికి ఆహ్వానం పలికే శుభసూచకంగా భావిస్తారు.

Bhogi Wishes 2026 :మూడు రోజుల సంక్రాంతి పండుగల్లో తొలి రోజు భోగి (Bhogi 2026). ధనుర్మాసానికి ముగింపు పలికే ఈ పర్వదినం, కొత్త జీవనానికి ఆహ్వానం పలికే శుభసూచకంగా భావిస్తారు. భక్తిశ్రద్ధలతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన గోదాదేవి, శ్రీరంగనాథుడిని వరించిన పుణ్య ఘట్టానికి ప్రతీకగా భోగి పండుగను జరుపుకుంటారు.

లేమి, కష్టాలు, చీకట్లను దహించి…

భోగభాగ్యాలు, శుభకాంక్షలు, వెలుగులు నింపాలనే ఆకాంక్షతోనే భోగి మంటలను వెలిగిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని, కొత్త ఆశలు–కొత్త ఆశయాలకు నాందిగా పెద్దలు భావిస్తారు.

పండుగలు కేవలం ఆనందానికి మాత్రమే కాదు…

మన సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానాన్ని తెలియజేసే ప్రతిబింబాలు. మనుషులతో పాటు పశుపక్షాదులు, ప్రకృతి కూడా మన కుటుంబంలో భాగమే అన్న భావనను సంక్రాంతి పండుగ మనకు గుర్తు చేస్తుంది. అందుకే ఈ పర్వదినాల్లో చెప్పే శుభాకాంక్షలు కూడా అంతే అందంగా, ఆత్మీయంగా ఉండాలి.

భోగి శుభాకాంక్షలు 2026 – షేర్ చేసుకోండి

ఈ భోగి మంటలు మీ ఇంట

సరికొత్త వెలుగులు నింపాలని

మనస్ఫూర్తిగా కోరుకుంటూ…

భోగి పండుగ శుభాకాంక్షలు 2026

ఇంటికొచ్చే పాడి పంటలు

కమ్మనైన పిండి వంటలు

చలికాచే భోగి మంటలు

ఆనందంగా ఉండే కొత్త బంధాలు

ఈ సంక్రాంతి మీ ఇంట వెలుగులు నింపాలని కోరుకుంటూ

భోగి శుభాకాంక్షలు 2026

భోగి మంటల వెచ్చని వెలుగులు

రంగురంగుల రంగవల్లులు

కొత్త బియ్యపు పొంగళ్లు

మదినిండా ఆనందపు పరవళ్లు

భోగి పండుగ శుభాకాంక్షలు 2026

కష్టాలను దహించే భోగి మంటలు

భోగాలను అందించే భోగి పండుగ

ధాన్యపు రాశులతో నిండిన ఇళ్లు

అందరికీ భోగి శుభాకాంక్షలు 2026

పచ్చటి తోరణాలతో

ముంగిట ముగ్గులతో

భోగి సందళ్లతో

సంక్రాంతికి సుస్వాగతం

అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు 2026

శుభప్రదమైన శ్లోకాలు

అగ్నిం ప్రపద్యే భోగదాం భోగినీ భోగదాయినీ

పాపదాహక భోగేశి మమ దేహం శుద్ధయతాం

అర్థం:

ఓ అగ్నిదేవా! నీవు భోగభాగ్యాలను ప్రసాదించేవాడివి.

నా పాపాలను దహనం చేసి శుద్ధిని ప్రసాదించు.

భోగి పర్వదినే పుణ్యే హృదయంలో దహతాం మలం

ఉద్భవతు శుభో భావః సత్యధర్మారాధనాత్మకః

అర్థం:

ఈ భోగి పర్వదినాన మనసులోని చెడు ఆలోచనలు దహించబడాలి.

సత్యం, ధర్మం, శుభం మన హృదయంలో వికసించాలి.

గమనిక:

ఈ కథనంలోని సమాచారం సంప్రదాయ, మత విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడింది. ఇది అవగాహన కోసం మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Show Full Article
Print Article
Next Story
More Stories