Blood Pressure: ఉప్పు మాత్రమే కాదు.. ఈ 5 వస్తువులు కూడా రక్తపోటును వేగంగా పెంచుతాయి

Blood Pressure
x

Blood Pressure: ఉప్పు మాత్రమే కాదు.. ఈ 5 వస్తువులు కూడా రక్తపోటును వేగంగా పెంచుతాయి

Highlights

Blood Pressure: ప్రస్తుత కాలంలో రక్తపోటు సమస్య కూడా చాలా సాధారణమైపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడితో కూడిన జీవితం రక్తపోటుకు కారణాలు కావచ్చు.

Blood Pressure: ప్రస్తుత కాలంలో రక్తపోటు సమస్య కూడా చాలా సాధారణమైపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడితో కూడిన జీవితం రక్తపోటుకు కారణాలు కావచ్చు. నేటి కాలంలో చాలా మంది చిన్న వయసులోనే అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది. కానీ దాని తీవ్రతను తక్కువ అంచనా వేయలేము. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే భవిష్యత్తులో గుండెపోటు , మూత్రపిండాల వైఫల్యం, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది జీవనశైలి వ్యాధి కాబట్టి కొన్ని మార్పులు చేయడం ద్వారా ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఈరోజు మనం అధిక బిపికి కారణమయ్యే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం..

ప్రాసెస్ చేసిన ఆహారం

ప్రాసెస్ చేసిన ఆహారం తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి ఏదోక విధంగా ఊబకాయం నుండి అధిక రక్తపోటు వరకు సమస్యలను తెస్తుంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్ వంటివి అధిక బిపికి ప్రత్యక్ష కారణమవుతాయి. మీకు రక్తపోటు సమస్య కూడా ఉంటే, మీరు వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువగా వేయించిన ఆహారం

మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే, మీ ఆహారం నుండి వేయించిన ఆహారాన్ని తొలగించండి. పకోడీలు, సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు తినడానికి ఎంత రుచిగా ఉన్నా, అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటిలో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. వీటితో పాటు, ఉప్పు, పిండి, నూనె, సుగంధ ద్రవ్యాలు వాటిలో పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి బిపిని పెంచుతాయి. కాబట్టి, ఎక్కువగా వేయించిన ఆహారం తీసుకోకండి.

ఊరగాయలు

మార్కెట్‌లో తయారు చేసిన ఊరగాయలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వీరు ఎక్కువగా నూనె, ఉప్పు లేదా వెనిగర్ కలిగి ఉంటుంది. ఇవన్నీ రక్తపోటును పెంచుతాయి. ముఖ్యంగా మీరు ప్రతిరోజూ ఊరగాయలు తింటుంటే, మీరు రక్తపోటు నిర్వహణలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.

స్వీట్లు తినడం

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువగా స్వీట్లు తినడం వల్ల కూడా బిపి పెరుగుతుంది. నిజానికి, మీరు చాక్లెట్, స్వీట్లు లేదా ఏదైనా ఇతర బేకరీ వస్తువులు వంటి తీపి పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు, ఇన్సులిన్ స్థాయి వేగంగా పెరుగుతుంది. దీని వల్ల సిరలు బిగుసుకుపోయి బిపి పెరగడం ప్రారంభమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రజలు ఎక్కువ స్వీట్లు తింటే, వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు రెట్టింపు అవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories