
Broken Heart Syndrome: నిజంగానే గుండె పగులుతుందా? బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ లక్షణాలు, కారణాలివే!
మనం ఎవరైనా బాగా బాధపడుతుంటే "అయ్యో.. గుండె పగిలినంత పని అయిందే" అంటుంటాం. ఇది కేవలం మాటలకే కాదు.. మన శరీరానికి కూడా వర్తిస్తుందంటున్నారు వైద్య నిపుణులు.
మనం ఎవరైనా బాగా బాధపడుతుంటే "అయ్యో.. గుండె పగిలినంత పని అయిందే" అంటుంటాం. ఇది కేవలం మాటలకే కాదు.. మన శరీరానికి కూడా వర్తిస్తుందంటున్నారు వైద్య నిపుణులు. అతిగా బాధపడినా లేదా విపరీతమైన ఒత్తిడికి గురైనా మన గుండె కండరాలు తాత్కాలికంగా బలహీనపడతాయని చెబుతున్నారు. దీనినే వైద్యులు 'బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్' అని పిలుస్తున్నారు. ఇంతకీ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే ఏమిటో స్టోరీలో తెలుసుకుందాం.
ఇది ఎందుకు వస్తుందంటే..
మనకు ఇష్టమైన వ్యక్తులు దూరం అయినప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు లేదా ఎవరైనా వెన్నుపోటు పొడిచినప్పుడు మన మనసు తీవ్రమైన షాక్‌కు గురవుతుంది. ఆ సమయంలో శరీరంలో 'స్ట్రెస్ హార్మోన్లు' ఒక్కసారిగా పెరిగిపోయి గుండెపై ఒత్తిడి పెంచుతాయి. దీనివల్ల గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేకపోతుంది. ఇది ఎక్కువగా 50 ఏళ్లు దాటిన వారిలో కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
లక్షణాలు ఎలా ఉంటాయంటే..
ఈ సమస్య వచ్చినప్పుడు గుండెపోటు (Heart Attack) వచ్చినట్లే అనిపిస్తుంది. ప్రధానంగా ఇవి కనిపిస్తాయి..
* ఛాతీలో విపరీతమైన నొప్పి రావడం.
* ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
* గుండె దడగా అనిపించడం, విపరీతమైన నీరసం.
* కళ్లు తిరగడం, వాంతులు లేదా చెమటలు పట్టడం.
మిమ్మల్ని మీరు కాపాడుకోడానికి వీటిని ట్రై చేయండి..
* బాధను మనసులోనే అణచుకోకుండా ఉండటమే దీనికి ప్రధాన పరిష్కారం.
* ఏదైనా బాధ ఉంటే మీకు నచ్చిన వారితో పంచుకోండి.
* మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మెడిటేషన్ చేయండి.
* రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.
బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనేది తాత్కాలికమైన సమస్య అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంటే సరైన సమయానికి చికిత్స చేయించుకుంటే, కొన్ని రోజుల్లోనే గుండె మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుందన్నారు. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మీ గుండె పదిలంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యానికి పునాది. అందుకే అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండండి. పైన చెప్పిన లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
- Broken Heart Syndrome symptoms
- Takotsubo Cardiomyopathy
- stress-induced cardiomyopathy
- heart attack vs broken heart syndrome
- causes of broken heart syndrome
- emotional stress and heart health
- chest pain after emotional shock
- broken heart syndrome in women over 50
- heart health tips Telugu
- can stress cause heart failure

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




