Diabetes: షుగర్ పేషెంట్లు పాలు తాగొచ్చా? తాగితే ఏం జరుగుతుంది?

Diabetes
x

Diabetes: షుగర్ పేషెంట్లు పాలు తాగొచ్చా? తాగితే ఏం జరుగుతుంది?

Highlights

Diabetes: డయాబెటీస్ ఉన్నవాళ్లు ఎప్పుడు శరీరంలో సుగర్ లెవెల్స్ ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. సుగర్ లెవెల్ ఎప్పుడూ ఒకేలా ఉండాలన్నా, వాటిలో మార్పులు రాకుండా ఉండాలన్నా సుగర్ పేషెంట్లు చేయాల్సిన పని ఒక్కటే.. సరైన ఆహారం సరైన సమయంలో తీసుకోవడం.

Diabetes: డయాబెటీస్ ఉన్నవాళ్లు ఎప్పుడు శరీరంలో సుగర్ లెవెల్స్ ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. సుగర్ లెవెల్ ఎప్పుడూ ఒకేలా ఉండాలన్నా, వాటిలో మార్పులు రాకుండా ఉండాలన్నా సుగర్ పేషెంట్లు చేయాల్సిన పని ఒక్కటే.. సరైన ఆహారం సరైన సమయంలో తీసుకోవడం. ఇలా చేయకపోవడం వల్ల చాలామంది డయాబెటీస్ ను పెంచుకుంటూ వెళ్తారు. ముఖ్యంగా సుగర్ పేషెంట్లు తక్కువ కొవ్వు ఉన్న పదార్దాలు తీసుకోవడం మంచిదని అంటారు. అయితే డయాబెటీస్ ఉన్నవాళ్లు పాలు తాగొచ్చా లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

కాల్షియం

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించాలంటే తక్కువ కొవ్వు, ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారపదార్ధాలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. ఇదిలా ఉంటే సుగర్ పేషెంట్లలో ఎముకలు బలహీనంగా తయారవుతుంటాయి. అలాంటప్పుడు ఈ పేషంట్లు పాలు తాగాలి. అయితే ఈ పాలను పరగడుపున లేదా రాత్రిళ్లు తాగకుండా ఉదయం పదకొండు గంటలకు టీ తాగే స్థానంలో ఈ పాలు తాగడం మంచిదంటున్నారు.

ప్రోటీన్

అంతేకాకుండా సుగర్ పేషంట్లకు ప్రోటీన్ చాలా అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయాలంటే ప్రోటీన్ అవసరం పడుతుంది. అందుకే ప్రతిరోజూ పాలు తాగితే ఈ సమస్య నుండి బయటపడొచ్చు. పాలల్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తొమ్మిది ముఖ్యమైన అమైనో అమ్లాలు ఉంటాయి. కాబట్టి సుగర్ పేషంట్లు ప్రతిరోజూ పాలును తాగాలి.

కార్బోహైడ్రేట్లు

పాలల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఇది నిలుపుతుంది. తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న పాలు తాగితే సుగర్ పేషంట్ల శరీరానికి మంచిది. అయితే ఇప్పటికే సుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు, డాక్టర్లు పాలు తాగొద్దని సలహా ఇచ్చిన వారు, ఒబేసిటీతో బాధపడుతున్నవారు, లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు డాక్టర్ల సలహా మేరకు పాలు తాగడం చాలామంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories