Chanakya Niti: ఈ ప్రశ్నలు అడగకుండా ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి

Chanakya Niti: ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు కొన్ని ప్రశ్నలు అడగాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు.
x

Chanakya Niti

Highlights

Chanakya Niti: ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు కొన్ని ప్రశ్నలు అడగాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అవేమిటో చూద్దాం

Chanakya Niti: ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు సంపాదించడం ఎంత కష్టమో, దానిని ఆదా చేయడం.. తెలివిగా ఖర్చు చేయడం మరింత క్లిష్టమైన విషయం. అందుకే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆచార్య చాణక్యుడు తన నేతి శాస్త్రంలో ప్రతి మనిషి ఆచరించాల్సిన సరైన విధానాలను స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతి అంశంలోనూ ఎలా వ్యవహరించాలి? సమాజంలో ఉన్నతంగా.. బాధ్యతగా మెలగాలంటే ఎలాంటి విధానాలు పాటించాలి. ముఖ్యంగా ఆర్ధిక పరమైన విషయాల్లో ఎలా నెగ్గుకురావాలి వంటి విషయాలను ఆచార్య చాణక్యుడు ఎప్పుడో వివరించారు. ఈ అంశాలన్నీ కాలాలకు అతీతంగా ఇప్పటికీ మానవ జీవితంలో పాటించాల్సిన విధానాలుగానే ఉండడం విశేషం ఇదిగో అలా ఆచార్య చాణక్యుడు అప్పు ఇచ్చేటప్పుడు ఎలా వ్యవహరించాలి అనేది కూడా చెప్పారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం.

స్నేహితులు..బంధువులు ఆర్థిక సహాయం అడిగినపుడు ప్రొఫెషనల్ గా వ్యవహరించాలని ఆచార్య చాణక్యుడు స్పష్టంగా సూచించారు. తన నీతిశాస్త్రంలో, ఆర్థిక లావాదేవీల గురించి స్పష్టమైన, కఠినమైన నియమాలను ఆయన ప్రస్తావించారు. మనకు బాగా దగ్గర వ్యక్తి అప్పుగా డబ్బు అడిగితే కొన్ని ప్రశ్నలు కచ్చితమా అడగాలంటారు చాణక్యుడు. ఈ ప్రశ్నలు అడగడం వల్ల మీ డబ్బును సురక్షితంగా ఉంచడమే కాకుండా మీ రిలేషన్ కూడా సురక్షితంగా ఉంటుంది.

అసలు డబ్బు ఎందుకు అవసరం ?

Chanakya Niti: బంధువులు డబ్బు అడిగితే, మీరు అడగాల్సిన మొదటి ప్రశ్న అప్పు తీసుకోవాల్సినంత అవసరం ఏమిటి అనేది. అప్పు అడిగిన వారు హాస్పిటల్ ఖర్చులు, పిల్లల చదువు ఇలాంటి ముఖ్యమైన కారణాల కోసం అనే సమాధానం చెబితే, కచ్చితంగా సహాయం చేయాలనీ చాణక్య చెప్పారు. మిమ్మల్ని అప్పు అడిగిన వ్యక్తి దుర్వ్యసనాలకు బానిస అని తెలిస్తే అప్పు ఇవ్వకపోవడమే మంచిది అని సూచించారు. బెట్టింగ్ లాంటి దురలవాట్లు ఉన్న వ్యక్తులకు అప్పు ఇవ్వడం అంటే మీ డబ్బును బూడిద చేసుకోవడమే అని చాణక్యుడు హెచ్చరించారు.

అప్పు ఎప్పుడు తీరుస్తారు?

ఇది కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ మీరు ఈ ప్రశ్న కచ్చితంగా అప్పు ఇచ్చే ముందు అడిగితీరాలని చాణక్యుడు చెప్పారు. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వబోతున్నట్లయితే, వారు ఏ సోర్స్ నుండి డబ్బు తిరిగి చెల్లిస్తారో అడగాలి. రుణం తిరిగి చెల్లించడానికి కచ్చితమైన గడువు పెట్టుకోవాలి. స్పష్టమైన ప్రణాళిక లేకుండా రుణం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో మీకు ఇబ్బంది కలుగుతుందని ఆచార్య చాణక్యుడు అంటున్నారు.

రాతపూర్వక ఒప్పందం చేసుకుందామా?

ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. అప్పు ఇచ్చే ముందు లిఖితపూర్వక రుజువు చాలా ముఖ్యం. అది మీ స్వంత సోదరుడికి ఇచ్చే అప్పు అయినాసరే.. విషయాన్ని రాతపూర్వకంగా ఉంచుకోవాలి. చిన్న చిన్న అప్పులకు కాదుకానీ, పెద్ద లావాదేవీలు ఎప్పుడూ లిఖిత పూర్వకంగా ఉండాలని చాణక్యుడు చెప్పారు. ఇది మోసాన్ని నివారించడానికి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించుకోవడానికి మీకు సహాయపడుతుంది.

ఇలా అప్పు అడిగిన వారిని మాత్రమే ప్రశ్నలు అడగడం కాదు.. మిమ్మల్ని మీరు కూడా అప్పు ఇచ్చేముందు ప్రశ్నించుకోవాలి. అవతల వ్యక్తి ఎంత అవసరంలో ఉన్నా.. మీ దగ్గర అతనికి అప్పు ఇచ్చి సహకరించేంత అవకాశం ఉందా? అనే ప్రశ్న మీరు వేసుకోవాలి. మీ దగ్గర తగినంత డబ్బు ఉంటేనే ఇతరులకు ఇవ్వండి. అలాగ మీదగ్గర ఉండే ఎమర్జెన్సీ ఫండ్స్ నుంచి ఎప్పుడూ ఇతరులకు అప్పుగా ఇవ్వకండి.. మీ అవసరాల కోసం మీరు దాచుకున్న డబ్బును మరొకరికి ఇవ్వడం చాలా పెద్ద మూర్ఖత్వం అని ఆచార్య చాణక్యుడు స్పష్టంగా చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories