Chandra Grahanam 2025: గ్రహణం వేళ ఆలయాలు ఎందుకు మూసేస్తారు? గర్భిణీలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

Chandra Grahanam 2025: గ్రహణం వేళ ఆలయాలు ఎందుకు మూసేస్తారు? గర్భిణీలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు
x

Chandra Grahanam 2025: గ్రహణం వేళ ఆలయాలు ఎందుకు మూసేస్తారు? గర్భిణీలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

Highlights

Chandra Grahanam 2025: దేశవ్యాప్తంగా ప్రతి గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేయడం అనాదిగా వస్తున్న ఆచారం.

Chandra Grahanam 2025: దేశవ్యాప్తంగా ప్రతి గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేయడం అనాదిగా వస్తున్న ఆచారం. తిరుమల వేంకటేశ్వర ఆలయం సహా అనేక దేవాలయాలు సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో మూసి వేయబడతాయి. గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే శాస్త్రోక్త సంప్రోక్షణ చేసి తిరిగి భక్తులను అనుమతిస్తారు.

గ్రహణం ఎప్పుడు?

ఈ ఏడాది సెప్టెంబర్ 7న (ఆదివారం) సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా దేశంలోని అనేక ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తారు.

గ్రహణాలకు ఆలయాలకు సంబంధం ఏమిటి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు, కేతువు అశుభ గ్రహాలుగా పరిగణిస్తారు. సూర్యుడు, చంద్రుడు వీటి ప్రభావానికి లోనైనప్పుడు గ్రహణం సంభవిస్తుంది. ఈ సమయంలో భూమిపైకి వచ్చే కిరణాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు. ఆలయ విగ్రహాల్లో నిక్షిప్తమైన శక్తిపై ప్రతికూల ప్రభావం పడకుండా ఆలయ తలుపులను మూసివేస్తారు.

గ్రహణం వేళ ఎందుకు తినకూడదు?

పురాణాల ప్రకారం గ్రహణ సమయంలో ఆహార పదార్థాలు కలుషితమవుతాయని నమ్మకం. శాస్త్రీయంగా కూడా ఆ సమయంలో వెలువడే కిరణాలు ఆహారంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అందువల్ల గ్రహణం మొదలుకాక మూడు గంటల ముందు భోజనం చేయాలని పెద్దలు సూచిస్తారు.

గరిక లేదా దర్భ ఎందుకు వేస్తారు?

ఆహార పదార్థాలపై గరిక లేదా దర్భ ఉంచితే గ్రహణ ప్రభావం ఉండదని విశ్వసిస్తారు. రామాయణంలో సీతమ్మ వారు రావణునితో మాట్లాడేటప్పుడు గరికను అవరోధంగా ఉపయోగించారన్న ఉదాహరణ దీనికి ఆధారం.

గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గ్రహణ సమయంలో గర్భిణీలు ఇంట్లోనే ఉండి బయటకు వెళ్లకూడదని సంప్రదాయం. శాస్త్రీయంగా కూడా గర్భంలోని శిశువు అత్యంత సున్నితంగా ఉండటంతో కిరణాల ప్రభావం పడకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని పాటించమని పెద్దలు చెబుతారు.

శాస్త్రీయ దృక్కోణం

ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహణం సమయంలో ప్రత్యేకమైన కిరణాలు వెలువడతాయి. ఇవి మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గ్రహణంలో తెరచి ఉండే ప్రత్యేక ఆలయాలు

శ్రీకాళహస్తి ఆలయం (చిత్తూరు జిల్లా) : నవగ్రహ కవచం ఉన్న కారణంగా ఆలయ శక్తి తగ్గదనే నమ్మకంతో గ్రహణం సమయంలో కూడా ఆలయాన్ని తెరిచి ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

పాదగయ క్షేత్రం (తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం) : కుక్కుటేశ్వర స్వామి దేవాలయం కూడా చంద్ర గ్రహణ సమయంలో తెరిచి ఉంచి విశేష పూజలు నిర్వహించడం సంప్రదాయం.

ముఖ్య గమనిక: పైన చెప్పిన వివరాలు పురాణాలు, జ్యోతిష్యం, సంప్రదాయాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటికి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు పూర్తిగా లేకపోవచ్చు. నమ్మకం, విశ్వాసం పూర్తిగా వ్యక్తిగత అంశం.

Show Full Article
Print Article
Next Story
More Stories