Cherry Tomatoes: మిరాకిల్స్‌ మించిన కూరగాయ.. తిన్న వెంటనే శరీరంలో అద్భుతం

Cherry Tomatoes: మిరాకిల్స్‌ మించిన కూరగాయ.. తిన్న వెంటనే శరీరంలో అద్భుతం
x
Highlights

Cherry Tomatoes Benefits: మార్కెట్లో మామూలు టమోటాలు చూస్తాం.. కానీ చెర్రీ టమాటాలు చాలా అరుదు. అయితే దీంట్లో అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.

Cherry Tomatoes Benefits: చెర్రీ టమాటాలు.. ఈ టమాటాలు ఎరుపు రంగులో రుచికరంగా ఉంటాయి. దీంతో అనేక అద్భుత ప్రయోజనాలు మన శరీరంలో జరుగుతాయి. మామూలుగా అయితే సాధారణ టమాటాలు ఎక్కువగా వినియోగిస్తాం. కానీ ఈ చెర్రీ టమాటాలో దానికి మించిన అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. చెర్రీ టమాటాలు గుండె ఆరోగ్యానికి మేలు చేసి జీర్ణాశయానికి ప్రేరేపిస్తుంది. అంతేకాదు చర్మ రంగును కూడా మెరుగు చేస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది రుచికరమైన ఆరోగ్యకరమైన స్నాక్ అవుతుంది.

ఈ చెర్రీ టమాటాలు తినడం వల్ల ఇందులో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కడుపు సమస్యలు రాకుండా నివారిస్తుంది. దీర్ఘకాలిక మలబద్ధక సమస్యలకు మంచి రెమెడీ అని చెప్పొచ్చు.

అంతేకాదు ఈ చెర్రీ టమాటాలు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా తోడ్పడుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. చెర్రీ టమోటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని నిత్య యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఆక్సిడేటివ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి.

చెర్రీ టమాటోలో క్యాలరీలు తక్కువ. ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి బరువు నిర్వహణలో ఉన్న వాళ్ళు ఈ టమోటాలు డైట్లో చేర్చుకోవాలి. పోషకాలు పుష్కలంగా ఉండే చెర్రీ టమాటాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరగకుండా ఉంటారు.

ఈ టమాటోలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం అంతే కాదు. ఇందులో లైకోపీన్ కూడా ఉంటుంది. దీని వల్ల ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ కాకుండా చేయడంతో పాటు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. తద్వారా సీజనల్‌ జబ్బులు మీ దరి చేరకుండా ఉంటాయి.

చెర్రీ టమాటాలు గుండె ఆరోగ్యానికి మేలు ఎందుకంటే ఇందులో పొటాషియం ఉంటుంది. రక్తపోటుని నివారిస్తుంది. ఎక్కువ శాతం ఫైబర్ ఉండటం వల్ల ఇది గుండె పనితీరును కూడా మెరుగు చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories