Chewing Cloves Benefits: రాత్రి పడుకునే ముందు లవంగం నమిలితే ఏం జరుగుతుందో తెలుసా? ఆశ్చర్యపోయే ఆరోగ్య ప్రయోజనాలు!


Chewing Cloves Benefits: రాత్రి పడుకునే ముందు లవంగం నమిలితే ఏం జరుగుతుందో తెలుసా? ఆశ్చర్యపోయే ఆరోగ్య ప్రయోజనాలు!
Chewing Cloves Benefits: రాత్రి పడుకునే ముందు ఒక లవంగం నమిలితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే! జీర్ణ సమస్యలు, నిద్రలేమి, శ్వాసకోస ఇబ్బందులకు ఇది ఒక రామబాణంలా పనిచేస్తుంది.
Chewing Cloves Benefits: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రాసెస్డ్ ఫుడ్ లేదా భారీ భోజనం తీసుకోవడం వల్ల చాలా మంది అజీర్తి, నిద్రలేమి సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, మన వంటింట్లో దొరికే 'లవంగం'తో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జీర్ణక్రియకు లవంగం ఎలా తోడ్పడుతుంది? ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం వల్లే చాలా మందికి నిద్ర కరువవుతోంది. రాత్రి పడుకునే ముందు ఒక లవంగం నమిలితే అందులోని 'యూజేనాల్' (Eugenol) అనే పదార్థం జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం మరియు అజీర్ణం వంటి సమస్యలను తగ్గించి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే నోటిలోని బ్యాక్టీరియాను చంపి, నోటి దుర్వాసనను అరికడుతుంది.
శ్వాసకోస సమస్యలు & ఒత్తిడి మాయం: దగ్గు, కఫం, గొంతు మంటతో ఇబ్బంది పడేవారికి లవంగం ఒక అద్భుత ఔషధం. దీని సహజ సుగంధం నరాలను శాంతింపజేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా మనసు ప్రశాంతంగా మారి, మధ్యలో మెలుకువ రాకుండా గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది.
మరికొన్ని ముఖ్యమైన చిట్కాలు:
గోరువెచ్చని నీరు: భోజనానికి ముందు లేదా తర్వాత గోరువెచ్చని నీరు తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.
కాఫీ, టీలకు దూరం: రాత్రి వేళల్లో కెఫిన్ అధికంగా ఉండే టీ, కాఫీలు తాగడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. వీటికి బదులు సహజ సిద్ధమైన చిట్కాలు పాటించడం మేలు.
ప్రకృతి సిద్ధంగా లభించే లవంగాలను రోజువారీ అలవాటుగా మార్చుకోవడం ద్వారా అటు జీర్ణవ్యవస్థను, ఇటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



