Chickpeas: శెనగలలో ప్రొటీన్‌ పుష్కలం.. అధిక బరువుతో పాటు ఈ సమస్యలకి చెక్‌..!

Chickpeas Are Rich in Protein Lose Weight Easily
x

Chickpeas: శెనగలలో ప్రొటీన్‌ పుష్కలం.. అధిక బరువుతో పాటు ఈ సమస్యలకి చెక్‌..!

Highlights

Chickpeas Benefits: మన ఇళ్లలో ఉండే శెనగలలో ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది.

Chickpeas Benefits: మన ఇళ్లలో ఉండే శెనగలలో ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. వీటిని చాలా రకాలుగా తింటారు. కొంతమంది ఉడకబెట్టి తింటే మరికొంతమంది ఉదయం నానబెట్టి తింటారు. ఇంకొంతమంది ఏకంగా కూర వండుకుంటారు. అయితే వీటిని ఏ విధంగా తీసుకున్నా ఆరోగ్యానికి మేలే జరుగుతుంది. చిన్నిపిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. ఇందులో పోషకాలకి కొదవ లేదు. ఇది ఇతర పప్పుల కంటే 12 నుంచి 15 గ్రాముల ఎక్కువ ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. బరువు తగ్గిస్తుంది

శెనగలు ఫైబర్‌కి గొప్ప మూలం అని చెప్పవచ్చు. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

2. కిడ్నీకి మేలు

గ్రాము శెనగలలో 28 శాతం భాస్వరం ఉంటుంది. ఇది శరీరంలో కొత్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఇది హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. కిడ్నీలో ఉండే విష పదార్థాలను శుభ్రపరుస్తుంది.

3. రక్తహీనత నివారణ

శెనగలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తహీనత ఉండదు. పిల్లల్లో రక్తహీనత విషయంలో గర్భిణులు, బాలింతల విషయంలో శెనగలు తినమని వైద్యులు సలహా ఇస్తారు.

4. కొలెస్ట్రాల్ తక్కువ

శెనగలు శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతాయి. ఇది పేగులోని పిత్తంతో కలిపి రక్తంలో పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

5. రక్తపోటు అదుపులో

అధిక రక్తపోటు ఉన్న రోగులు శెనగలు తింటే చాలా మంచిది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories