Chilli Benefits: పచ్చిమిర్చితో చర్మ సమస్యలు తగ్గుతాయా?

Chilli Benefits
x

Chilli Benefits: పచ్చిమిర్చితో చర్మ సమస్యలు తగ్గుతాయా?

Highlights

Chilli Benefits: ప్రతి వంటలో పచ్చిమిర్చి అవసరం. కానీ చాలామందికి దానివల్ల ఉపయోగాలేంటో తెలియదు. అందుకే కారంగా ఉంటుందని దానికి దూరంగా ఉంటాం. తింటున్నప్పుడు దాన్ని తీసి పక్కన పెడతాం.

Chilli Benefits: ప్రతి వంటలో పచ్చిమిర్చి అవసరం. కానీ చాలామందికి దానివల్ల ఉపయోగాలేంటో తెలియదు. అందుకే కారంగా ఉంటుందని దానికి దూరంగా ఉంటాం. తింటున్నప్పుడు దాన్ని తీసి పక్కన పెడతాం. కానీ పచ్చిమిర్చి చిన్నదే కానీ.. దాని శక్తి మాత్రం చాలా ఎక్కువ. ఎన్నో రకాల చర్మ సమస్యలకు ఇదొక మెడిసిన్. అదెలా అంటారా? రండి.. మీరే తెలుసుకోండి.

విటమిన్ సి

పండ్లలోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని అందరూ అనుకుంటారు. పచ్చిమిర్చిలో కూడా పుష్కలంగా విటమిన్ సి దొరుకుతుంది. ఇది చర్మంపై ముడతలు పడకుండా, చర్మం సాగిపోకుండా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

మచ్చలు మాయం

పచ్చిమర్చిని రెగ్యులర్‌‌గా ఆహారంలో తీసుకోవడం వల్ల ముఖంపై వచ్చే యాక్నె సమస్యను పూర్తిగా పోగొడుతుంది. పచ్చిమిర్చి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. అందుకే ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ సమస్యను దూరం చేస్తుంది.

ముడతలు దూరం

పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి నష్టం కలగకుండా చూస్తాయి. దీంతో చర్మం ముడతలు పడవు. పైగా మృదువుగా ఉంటుంది.

రక్తప్రసరణ వేగంగా..

పచ్చిమిరపకాయలు చర్మానికి రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి. ఎటువంటి చర్మ సమస్య ఉన్నా వీటిని తరచూ తినడం వల్ల వాటిని దూరం చేయొచ్చు. అంతేకాదు స్కిన్ గ్లో అవ్వాలన్నా కూడా వీటిని తినడం మంచిది.

ఎలా తినాలి?

పచ్చిమిర్చిని నేరుగా తినకూడదు. అందులో కారం ఎక్కువగా ఉంటుంది. అసిడిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే వాటిని నేరుగా తినకుండా కూరల్లో వేసుకోవాలి. ఇది పులుపు, తీపిలో బాగా ఉడికినప్పుడు పుల్లగా, తియ్యగా మారతాయి. అలాంటప్పుడు వీటిని తినొచ్చు. లేదంటే కూరల్లో వేసుకుని వండినప్పుడు వాటి రసం కూరల్లో కలుస్తుంది. అందుకే కాస్తైన మిరపకాయను కట్ చేసి కూరల్లో వేయాలి. ఇలా రోజూ పచ్చిమిర్చిని తినడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories