Coconut Water : ఏడాది లోపు పిల్లలకు కొబ్బరి నీరు ఇవ్వవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Coconut Water : ఏడాది లోపు పిల్లలకు కొబ్బరి నీరు ఇవ్వవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
x

Coconut Water : ఏడాది లోపు పిల్లలకు కొబ్బరి నీరు ఇవ్వవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Highlights

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి, ఇది శరీరానికి తక్షణ శక్తిని, తేమను అందిస్తుంది. అయితే, ఈ పోషకాలు నిండిన పానీయం అందరికీ మంచిదేనా?

Coconut Water : కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి, ఇది శరీరానికి తక్షణ శక్తిని, తేమను అందిస్తుంది. అయితే, ఈ పోషకాలు నిండిన పానీయం అందరికీ మంచిదేనా? ముఖ్యంగా, ఒక సంవత్సరం లోపు పిల్లలకు కొబ్బరి నీళ్లు ఇవ్వడం సురక్షితమేనా? అనేది చాలా మంది తల్లిదండ్రులకు ఉండే సందేహం. చిన్న పిల్లల జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వారికి ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ నేపథ్యంలో శిశువులకు కొబ్బరి నీళ్లు ఇవ్వడం గురించి ఆరోగ్య నిపుణులు ఏమి చెబుతున్నారు? ఏ వయసులో, ఎంత మోతాదులో ఇవ్వవచ్చు? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి నీరు శరీరానికి తేమ అందించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ, చిన్నపిల్లల జీర్ణవ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు కాబట్టి, వారికి ఆహారం ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం 6 నెలల లోపు పిల్లలకు కొబ్బరి నీటిని అస్సలు ఇవ్వకూడదు. ఈ వయసులో శిశువులకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ఉత్తమం. తల్లిపాలు అన్ని పోషకాలను అందిస్తాయి. 6 నెలల కంటే ముందు బయట దొరికే ఏ విధమైన ద్రవ పదార్థాలు, రసాలు, చక్కెర, ఉప్పు లేదా తేనెను కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవి శిశువుల సున్నితమైన కడుపుపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు.

శిశువు 6 నెలల వయస్సు దాటి, గట్టి ఆహారం లేదా మెత్తటి ఆహారాన్ని తినడం ప్రారంభించిన తర్వాతే కొబ్బరి నీటిని కొద్ది మొత్తంలో ఇవ్వవచ్చు. 6 నెలలు దాటిన తర్వాత, కొబ్బరి నీటిని చాలా తక్కువ పరిమాణంలో అంటే కేవలం 1 నుంచి 2 టీస్పూన్లు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాతే ఈ పరిమాణాన్ని నెమ్మదిగా పెంచాలి. పిల్లలకు కొత్త ఆహారాలు లేదా పానీయాలు ఇవ్వడానికి ముందు వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. తప్పు ఆహారం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, వాంతులు లేదా అతిసారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

6 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కొబ్బరి నీరు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. పిల్లలకు ఎల్లప్పుడూ తాజా కొబ్బరి నీటిని మాత్రమే ఇవ్వాలి. మార్కెట్‌లో లభించే ప్యాక్ చేసిన లేదా ఫ్లేవర్డ్ కొబ్బరి నీటిని అస్సలు ఇవ్వకూడదు, ఎందుకంటే వాటిలో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు కొబ్బరి నీరు ఇచ్చే ముందు, వారికి గ్యాస్, అతిసారం, వాంతులు లేదా కడుపు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకోవాలి. సమస్యలు ఉన్నప్పుడు కొబ్బరి నీరు ఇవ్వకూడదు. 6 నుండి 12 నెలల శిశువులకు కొబ్బరి నీటిని సప్టిమెంటుగా మాత్రమే ఇవ్వాలి, రోజుకు ఒకసారి మాత్రమే పరిమితం చేయాలి. ఈ వయస్సులో శిశువుకు నిజమైన పోషణ తల్లి పాల నుంచే లభిస్తుంది.

పిల్లలకు 1 సంవత్సరం పూర్తయ్యే వరకు ఉప్పు, చక్కెర లేదా తేనెను అస్సలు ఇవ్వకూడదు. కొత్త ఆహారాన్ని పరిచయం చేసేటప్పుడు, మొదట కొద్ది మొత్తంలో మాత్రమే ఇవ్వాలి. ఏదైనా కొత్త ఆహారం ఇచ్చిన తర్వాత పిల్లలలో కొత్త లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories